/rtv/media/media_files/2025/03/09/8tWWuuXxOcf7oWuH3uKJ.jpg)
IIFA Digital Awards 2025
IIFA Digital Awards 2025: భారతీయ సినీ పరిశ్రమల ప్రతిష్టాత్మకంగా భావించే IIFA 2025 అవార్డుల వేడుక కనుల పండుగగా మొదలైంది. జైపుర్ వేదికగా 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుండగా మొదటిరోజు బాలీవుడ్ తారలు, రాజకీయ నేతలు, ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
ఈ మేరకు ఐఫా డిజిటల్ అవార్డులను ప్రదానం చేయగా.. ఓటీటీలో భరీ ఆదరణ పొందిన సినిమాలు, సిరీస్‌లకు పురస్కారాలు అందించారు. ఓటీటీ సినిమాల్లో ఉత్తమ నటిగా కృతిసనన్, ఉత్తమ నటుడిగా విక్రాంత్ మస్సే విజేతలుగా నిలిచారు. ఆదివారం వేడుకలో మరిన్ని అవార్డులు ఇవ్వనున్నారు.
విజేతల లిస్ట్ ఇదే:
ఉత్తమ చిత్రం: అమర్ సింగ్ చంకీలా
ఉత్తమ నటుడు: విక్రాంత్ మస్సే (సెక్టార్ 36)
ఉత్తమ నటి: కృతి సనన్ (దో పత్తి)
ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకీలా)
ఉత్తమ సహాయ నటుడు: దీపక్ (సెక్టార్ 36)
ఉత్తమ సహాయ నటి: అనుప్రియా గోయెంకా (బెర్లిన్)
ఉత్తమ కథ: కనికా ధిల్లాన్ (దో పత్తి)
ఉత్తమ సిరీస్: పంచాయత్ సీజన్ 3
ఉత్తమ నటుడు: జితేంద్ర కుమార్ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ నటి: శ్రేయాచౌదరి (బందీశ్ బందిట్స్ సీజన్ 2)
ఉత్తమ దర్శకుడు: దీపక్ కుమార్ మిశ్రా (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటుడు: ఫైజల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటి: సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)
ఉత్తమ కథ: కోటా ఫ్యాక్టరీ సీజన్ 3
ఉత్తమ రియాల్టీ సిరీస్: ఫ్యాబ్యులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: యో యో హనీ సింగ్: ఫేమస్