Allu Arjun : ఆ హీరోయిన్ రెచ్చగొట్టడం వల్లే సిక్స్ ప్యాక్ చేసి చూపించా: అల్లు అర్జున్

ఓ హీరోయిన్ రెచ్చగొట్టడం వల్లే తాను గతంలో సిక్స్ ప్యాక్ చేసి చూపించానని అల్లు అర్జున్ తెలిపారు. తనతో ఓ సినిమాలో నటించిన హీరోయిన్ సౌత్ లో ఎవరూ సిక్స్ ప్యాక్ చేయలేరని అవమానించిందని.. దీన్ని తాను ఛాలెంజ్ తీసుకుని  సిక్స్ ప్యాక్ చేశానని చెప్పుకొచ్చాడు.  

New Update
six pack

six pack

ఓ హీరోయిన్ రెచ్చగొట్టడం వల్లే తాను గతంలో సిక్స్ ప్యాక్ చేసి చూపించానని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలిపారు. 20 ఏళ్ల క్రితం సౌత్ లో ఏ నటుడు చేయని సాహసం తాను చేశానని వెల్లడించారు. గురువారం రోజున వేవ్స్‌ సదస్సుకు హాజరైన అల్లు అర్జున్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అప్పట్లో తనతో ఓ సినిమాలో నటించిన హీరోయిన్ సౌత్ లో  ఎవరూ సిక్స్ ప్యాక్ చేయలేరని అవమానించిందని.. దీన్ని తాను ఛాలెంజ్ తీసుకుని  సిక్స్ ప్యాక్ చేశానని బన్నీ చెప్పుకొచ్చాడు.  

Also Read: Anu Aggarwal: నా మూత్రం నేనే తాగిన.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు: నటి సంచలనం!

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

వచ్చే కిక్కే వేరు

మన వల్ల కాదన్న పనిని చూపించడంలో వచ్చే కిక్కే వేరంటూ ఐకాన్  స్టార్ వెల్లడించాడు. అయితే ఆ హీరోయిన్ ఎవరూ అనేది మాత్రం అల్లు అర్జున్ బయటపెట్టలేదు.  కాగా  దేశముదురు సినిమాలో బన్నీ సిక్స్‌ ప్యాక్‌తో కనిపించాడు. ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు.  ఈ చిత్రం 2007 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. కాగా గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అల్లు అర్జున్..  పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.  

Also Read: Phalgam Attack: పాపం పాక్.. సొంత దేశం పేరెత్తడానికే భయపడుతున్న స్థానిక సెలబ్రెటీలు!-VIDEO

Also Read: Pahalgam Attack ఉగ్రదాడితో కఠిన చర్యలు.. పాకిస్థాన్ స్టార్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు