Sujatha : అల్లుడు ఆరోపణలు.. అత్త కౌంటర్.. ముదురుతోన్న విడాకుల పంచాయతీ!

జయం రవి ఆరోపణలపై  తాజాగా ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు.  జయం రవిని అల్లుడిలా కాకుండా కొడుకులా చూసుకున్నానని వెల్లడించారు.  రూ.100 కోట్లు అప్పులు చేసి మరీ అతనితో  సినిమాలు నిర్మించానన్నారు సుజాత.  

New Update
arathi-vijay

arathi-vijay

తమిళ నటుడు జయం రవి - ఆర్తి విడాకుల వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. ఆర్తిని తప్పుపడుతూ ఇటీవల స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశాడు జయం రవి. తన భార్య,ఆమె కుటుంబం తనని  ఆర్థికంగా, మానసికంగా కుంగదీసిందని ఆరోపిస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. అయితే జయం రవి ఆరోపణలపై  తాజాగా ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు.  జయం రవిని అల్లుడిలా కాకుండా కొడుకులా చూసుకున్నానని వెల్లడించారు.  రూ.100 కోట్లు అప్పులు చేసి మరీ అతనితో  సినిమాలు నిర్మించానన్నారు సుజాత.  గత ఏడాది కాలంగా అతను తన కుటుంబాన్ని దూరం పెడుతున్నాడని ఆమె ఆరోపించింది.

Also Read :  భారత్‌, పాకిస్థాన్‌ చర్చలు మళ్లీ ప్రారంభించాలి.. రష్యా కీలక ప్రకటన

"నేను జయం రవితో వరుసగా మూడు సినిమాలు తీశాను, అడంగ మారు, భూమి, సైరెన్. ఈ సినిమాల కోసం, నేను ఫైనాన్షియర్ల నుండి 100 కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకున్నాను.  ఆ డబ్బులో 25 శాతం జయం రవికి జీతంగా ఇచ్చాను. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.  నేను అతనితో చేసుకున్న ఒప్పందం, అతను తన బ్యాంకు ఖాతాకు చేసిన బదిలీ, నేను అతనికి చెల్లించిన పన్నులు సహా. ఇప్పుడు జయం రవి ఈ సినిమాల విడుదల సమయంలో నా కోట్ల రూపాయల అప్పులకు అతనిని బాధ్యుడ్ని చేశానని తప్పుడు ఆరోపణలు చేశాడు. ఇందులో కొంచెం కూడా నిజం లేదు. జయం రవి చెప్పినట్లుగా ఒక్క రూపాయికి కాదు, కోట్ల రూపాయలకు ఆయనను బాధ్యురాలిని చేసినట్లు ఏదైనా ఆధారాలు ఉంటే చూపించాలి" అని ఆమె డిమాండ్ చేశారు. 

Also Read :  కమల్ - శింబు ఫేస్ ఆఫ్.. మణిరత్నం గ్యాంగ్ స్టార్ డ్రామా 'థగ్ లైఫ్' ట్రైలర్

2009లో వివాహం

జయం రవి 2009లో ప్రముఖ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2024లో విడాకులు తీసుకుంటున్నట్లుగా రవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే ఆర్తి మాత్రం తన అనుమతి లేకుండానే తన భర్త ఈ విడాకుల ఈ ప్రకటన చేశాడంటూ ఆరోపించింది. దీంతో ఇద్దరి మధ్య విడాకుల వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. ఈ క్రమంలోనే జయం రవి తన భార్య ఆమె కుటుంబంపై కీలక ఆరోపణలు చేశారు.  

Also Read :  ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. 20 మంది మావోయిస్టు నేతలు అరెస్ట్‌!?

Also Read :  పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి.. ఎంపీ డిమాండ్

telugu-news | kollywood | aarthi | Sujatha Vijayakumar | actor-jayam-ravi

Advertisment
Advertisment
తాజా కథనాలు