Hrithik Roshan: 'వార్ 2' పై హృతిక్ రోషన్ ట్రోల్స్.. అంత మాట అనేశాడేంటి..?

హృతిక్ రోషన్ తన సినిమా 'War 2' బాక్సాఫీస్‌ ఫ్లాప్ అయినప్పటికీ, దుబాయ్ ఈవెంట్‌లో అభిమానుల మధ్య సరదాగా తన సినిమాను తానే ట్రోల్ చేశారు. 'War 2' సినిమాపై రిలీజ్ కు ముందు భారీ అంచనాలు ఉన్నపటికీ రిలీజ్ అయ్యాక నిరాశ పరిచింది.

New Update
Hrithik Roshan

Hrithik Roshan

Hrithik Roshan: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన తాజా సినిమా War 2 బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంపై హాస్యంగా స్పందించారు. తన సినిమాని తానే ట్రోల్స్ చేసుకోవడంతో, అభిమానులు ఆశ్చర్యంలో పడ్డారు.

తాజాగా దుబాయ్‌లోని Coca Cola అరినాలో జరిగిన ఒక ఈవెంట్‌లో హృతిక్ వేదికకు వచ్చారు. హోస్ట్ ఆయనను "గ్లోబల్ ఐకాన్" అని పరిచయం చేస్తూ ప్రశంసలతో స్వాగతించారు. అభిమానుల ఉత్సాహంతో  ఆయనకు స్వాగతం పలికారు.

Hrithik Roshan Trolls WAR 2 Movie

ఈ సందర్భంలో హృతిక్ సరదాగా ఒక కామెంట్ చేశారు. “మీ ప్రేమ చాలా స్నేహపూర్వకం… మీకు తెలుసు, నా సినిమా బాక్సాఫీస్‌లో ఫ్లాప్ అయింది, అందుకే ఇంత అభిమానాన్ని పొందడం బాగుంది. ధన్యవాదాలు” అని చెప్పారు. ఈ కమెంట్లు అభిమానులను నవ్వించింది.

War 2 సినిమాలో హృతిక్ రోషన్, Jr NTR ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 14న భారీ అంచనాలతో విడుదలైన సినిమా, ప్రేక్షకులను ఆకట్టలేకపోయింది. యాక్షన్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేసిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులు ముఖ్యంగా కథ, VFX క్వాలిటీ పరంగా నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు.

ఈ చిత్రం YRF Spy Universeలో భాగంగా వచ్చింది. Ek Tha Tiger, Tiger Zinda Hai, War, Pathaan, Tiger 3 వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత, War 2కు చాలా ఎక్కువ అంచనాలు ఉన్నాయి. అయితే, ఫలితం మాత్రం నిరుత్సాహపరిచింది

సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అశుతోష్ రాణా, కియారా అద్వానీ ముఖ్య పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాలతో విడుదల అయినప్పటికీ, War 2 విజువల్స్, కథ పరంగా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.

అలాంటి పరిస్థితుల్లో హృతిక్ తనపై తానే ట్రోల్ చేయడం అభిమానులు, మీడియా మధ్య చర్చకు కారణమైంది. ఫ్లాప్ అయినా కామెడీతో స్పందించడంపై కొంత మంది విమర్శలు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు