HIT 3: రిలీజ్ కి ముందే అర్జున్ సర్కార్ హవా.. భారీ ధరకు అమ్ముడైన 'హిట్3' డిజిటల్ రైట్స్.. ఎంతంటే

'హిట్3' ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ  సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ. 54కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.

New Update

HIT 3: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి హిట్ ఫ్రాంచైజీ  'హిట్3'. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మే1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పార్టులు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. హిట్ 3 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా నాని రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ.. మరింత హైప్ క్రియేట్ చేసింది. 

Also Read: Jahnavi Dasetty: గుడ్ న్యూస్ చెప్పిన మహాతల్లి.. పండంటి బిడ్డ‌కి పేరెంట్స్

భారీ ధరకు డిజిటల్ రైట్స్.. 

ఇదిలా ఉంటే 'హిట్3' ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ రూ. 54కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వరుస హిట్లతో సినిమా సినిమాకు నాని డిమాండ్ పెరుగుతున్నట్లు ఈ ఓటీటీ డీల్ చూస్తుంటే అర్థమవుతుంది. 

Also Read: Suma Chaaaat Show: తమన్ చాట్ ఛాలెంజ్.. సుమ కంటెస్ట్ లో విన్ అవ్వడానికి ఇలా చేయండి?

ఇప్పటికే హీరోగా తన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నాని.. మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా సత్తా చాటుతున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే  'కోర్ట్' మూవీతో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాను అందించారు.  గతవారం విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అతి తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలై.. భారీ వసూళ్లను రాబడుతోంది. 3 రోజుల్లోనే రూ. 24కోట్లు కలెక్ట్ చేసింది. 

Also Read: వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. తల్లీ కొడుకుల యుద్ధం! అర్జున్‌ S/O వైజయంతి' టీజర్ చూశారా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు