/rtv/media/media_files/2025/03/16/bFLewK8n24kzQT7QOuBx.jpg)
Jahnavi Dasetty
Jahnavi Dasetty: యూట్యూబర్ మహాతల్లి అలియాస్ జాహ్నవి దాశెట్టి దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈరోజు మధ్యాహ్నం జాహ్నవి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జానూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ ద్వారా తెలియజేసింది. దీంతో జాహ్నవి ఫ్రెండ్స్, అభిమానులు, పలువురు సెలెబ్రెటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read: Suma Chaaaat Show: తమన్ చాట్ ఛాలెంజ్.. సుమ కంటెస్ట్ లో విన్ అవ్వడానికి ఇలా చేయండి?
తల్లైన జాహ్నవి
2018లో సుశాంత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది జాహ్నవి. ఆ తర్వాత గతేడాది తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించిన ఈ జంట.. తాజాగా తమ వైవాహిక బంధానిక ప్రతీకగా పండండి బిడ్డకు జన్మనిచ్చారు. జాహ్నవి తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉండేది. అలాగే భర్తతో కలిసి బేబీ బంప్ ఫొటోలను కూడా పంచుకుంది.