/rtv/media/media_files/2025/03/16/bfzfoHsnX90e4LOr0gt7.jpg)
thaman chaat challenge
Suma Chaaaat Show: యాంకర్ సుమ కనకాల బుల్లితెరపై అనేక పాపులర్ షోలతో ఇండస్ట్రీలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. గలగలా మాట్లాడుతూ, సిచువేషన్ కి తగ్గట్లు కామెడీ చేస్తూ షోను పుల్ చేయడంలో సుమ తర్వాతే ఎవరైనా. ఓ వైపు మూవీ ప్రీ రిలీజ్ లు, ఇంటర్వ్యూలకు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు తన యూట్యూబ్ ఛానెల్ లో స్పెషల్ షోలు హోస్ట్ చేస్తోంది. తాజాగా “Chaaaat Show” అంటూ ఓ షోను ప్రారంభించింది. ఇందులో ప్రముఖ సెలెబ్రెటీలతో ఒక గంట పాటు ఫన్ చిట్ చాట్ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ షోలో సింగర్ సిద్ శ్రీరామ్, కిరణ్ అబ్బవరం, అనిల్ రావిపూడి గెస్టులుగా పాల్గొని సందడి చేశారు. అయితే ఈ షో నెక్స్ట్ ఎపిసోడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సుమ.. తమన్ అభిమానులకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు.
Also Read: Karnataka: రోజుకో రకంగా వాంగ్మూలం..తికమక పెడుతున్న రన్యారావు
Think you can stump @MusicThaman? 🎤
— Suma Kanakala (@ItsSumaKanakala) March 16, 2025
HUM your favorite Thaman tune (5-10 sec) POST it on your page with 👉 #ThamanChaaaatChallenge and TAG @ChaaaatShow!
The best 3 clips will be picked and Thaman will guess the songs! Let’s put his ears to the test! 🎧🔥 pic.twitter.com/kHTu3DTq4E
తమన్ కోసం 'గెస్ ది సాంగ్' అనే ఛాలెంజ్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే దీనికోసం మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. తమన్ పాటల్లోని మీ ఫేవరేట్ సాంగ్ ని ఒక 5-10 sec విజిల్ రూపంలో హమ్ చేస్తూ వీడియో రికార్డు చేసి.. దానిని @ChaaaatShow అనే పేజ్ కి ట్యాగ్ చేయండి. అలా పంపిన వాటిలో బెస్ట్ 3 వీడియోలను ఎపిసోడ్ లో తమన్ ముందు చేయడం జరుగుతుంది. మీరు హమ్ చేసిన పాటను తమన్ గెస్ చేస్తారు.
Also Read: Veera Dheera Soora Teaser: ఉత్కంఠభరితంగా విక్రమ్ 'వీర ధీర శూర' టీజర్.. ఫ్యాన్స్ గెట్రెడీ..!