థియేటర్లలోకి వచ్చేస్తున్న సందీప్ మజాకా.. ఆ పండుగ రోజే  గ్రాండ్‌ రిలీజ్..

సందీప్ కిషన్ మజాకా మూవీ మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూ వర్మ నటించగా రావు రమేష్, అన్షూ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ బాగుంది.

New Update
Mazaka

Mazaka Photograph: (Mazaka)

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ధమాకా ఫేం త్రినాథరావు దర్శకత్వంలో మజాకా అనే సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్యమూవీస్ బ్యాన‌ర్‌, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్‌లో 30వ సినిమాగా వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మూవీ టీం ఫిక్స్ చేసింది. కామెడీ ఎంటర్‌టైనర్‌లో వస్తున్న ఈ సినిమాను మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది.

ఇది కూడా చూడండి: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు

ఇది కూడా చూడండి: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడి వివాహం!

సందీప్ కిషన్ ఖాతాలో మరో హిట్..

ఈ సినిమా సంక్రాంతికే విడుదల చేయాల్సింది. కానీ అనుకోని కారణాలతో సినిమాను వాయిదా వేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్, సాంగ్స్, టీజర్ అన్నింటిని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. కామెడీ జోనర్‌లో అన్ని అదిరిపోయాయి. ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సందీప్ కిషన్ ఖాతాలో మరో హిట్ పడనుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సందీప్ కిషన్‌కు జోడీగా రీతూ వర్మ నటించింది. అలాగే సీనియర్ నటుడు రావు రమేష్, హీరోయిన్ అన్షూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు