/rtv/media/media_files/2025/10/13/venu-yellamma-2025-10-13-11-11-38.jpg)
Venu Yellamma
Venu Yellamma: 2023లో "బలగం" సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రజల మనసుల్లో బలంగా నిలిచిపోయిన "బలగం" సినిమా బాక్సాఫీస్‌లో మాత్రమే కాదు, డిజిటల్, టీవీ వేదికలపై కూడా అద్భుతంగా అలరించింది. ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు, గద్దర్ అవార్డులు అందుకున్న ఈ చిత్రం తరువాత, వేణు తీసే తదుపరి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!
ఎల్లమ్మ కథ ఇదేనా..?
వేణు దర్శకత్వంలో రూపొందబోతున్న కొత్త సినిమాకు “ఎల్లమ్మ” అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ సినిమా కథలో మహిళా ప్రధానత ఉండబోతుందని సమాచారం. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మొదట ఈ పాత్ర కోసం సాయి పల్లవిను సంప్రదించినట్టు తెలుస్తోంది, కానీ తరువాత కీర్తిని తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
హీరో కోసం వెతుకులాట
ఇంతవారికు ఈ చిత్రానికి హీరో ఎవరన్నది మాత్రం ఇంకా స్పష్టంగా లేదు. తొలుత, ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన సమయంలో నేచురల్ స్టార్ నాని(Nani) ఈ సినిమాలో నటించబోతున్నట్టు ప్రొడ్యూసర్ దిల్ రాజు స్వయంగా ప్రకటించారు. కానీ, నాని షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. "బలగం" సినిమాను, అలాగే "ఎల్లమ్మ" కథను నాని ప్రశంసించినప్పటికీ, తాను సమయం లేక చేయలేనన్నట్టు చెప్పాడు. ప్రస్తుతం నాని “ది పారడైస్” సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా, తర్వాత సుజీత్ దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్‌లో ఉంది.
Also Read: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!
నితిన్, తేజ సజ్జా, బెల్లంకొండ పేరు వినిపిస్తున్నా...
నాని తప్పుకున్న తరువాత, నితిన్ను(NithiinNithiin) తీసుకోవాలని దిల్ రాజు ఆలోచించినట్టు టాక్. "తమ్ముడు" సినిమా ప్రమోషన్స్ సమయంలో దిల్ రాజు ఈ విషయం చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తరువాత తేజ సజ్జాను కూడా సంప్రదించారనే వార్తలు వచ్చాయి.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) పేరు చర్చలో ఉంది. కానీ ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అఫిషియల్‌గా ప్రకటించలేదు. అతనిని ఇంకా సంప్రదించలేదని ప్రొడక్షన్ టీమ్ చెబుతోంది.
Also Read: "మిత్ర మండలి" స్పెషల్ ప్రీమియర్ షోలు.. ఇదిగో ఫుల్ డిటైల్స్
ఓ శక్తివంతమైన కథతో రాబోతున్న “ఎల్లమ్మ” సినిమాకు మహిళా ప్రధాన పాత్ర దాదాపు ఫిక్స్ అయినా, మేల్ లీడ్ నటుడిని ఎంపిక చేసే ప్రక్రియ ఇంకా సాగుతూనే ఉంది. వేణు యెల్డండి రాసిన పాత్రకు తగ్గట్టుగా నటనలో బలమున్న నటుడిని ఎంపిక చేయాలన్నదే మేకర్స్ ఉద్దేశం. వచ్చే రోజులలో ఎవరు ఈ ఛాన్స్ కొట్టేస్తారో చూడాలి!