/rtv/media/media_files/2025/10/13/mithra-mandali-premieres-2025-10-13-07-38-42.jpg)
Mithra Mandali Premieres
Mithra Mandali Premieres: ఈ దీపావళి సందర్భంగా ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమా "మిత్ర మండలి" థియేటర్లకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక NM జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ విజయేంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. సినిమాను కళ్యాణ్ మంథెన, భాను ప్రతాప్, డా. విజయేంద్ర రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. సప్తస్వ మీడియా వర్క్స్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ ప్రాజెక్టును నిర్మించగా, ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని BV వర్క్స్ బ్యానర్‌పై సమర్పిస్తున్నారు.
Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!
అక్టోబర్ 15న ప్రీమియర్ షోలు..
సినిమాపై ఇప్పటి నుంచే పాజిటివ్ బజ్ పెరుగుతోంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా, IMDbలో ట్రెండింగ్‌లోకి రావడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందు, అక్టోబర్ 15న ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
#MithraMandali Paid Premieres in Hyderabad on October 15th! 💥💥🔥🔥 pic.twitter.com/pkq4at9mkG
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) October 12, 2025
Also Read: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది. కుటుంబ సభ్యులతో కలిసి చూడదగిన హృదయాన్ని హత్తుకునే కంటెంట్‌తో రోపొందిందని సెన్సార్ బోర్డు అభినందించింది. ఈ విశ్వాసంతోనే ప్రేక్షకులకు ముందుగానే సినిమా చూపించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.
This Diwali, FUN starts early with #MithraMandali Premieres on Oct 15th 💥
— Thyview (@Thyview) October 12, 2025
Bookings Open Soon ❤️🔥 pic.twitter.com/urTXMNHZO3
Also Read : కాకరేపుతున్న 'కట్టలన్' ఫస్ట్ లుక్ .. రక్తంతో పోస్టర్ వైరల్!
దీపావళి హిట్‌గా "మిత్ర మండలి"..?
“మిత్ర మండలి” ఒక కామెడీ, స్నేహం, భావోద్వేగాలను కలిపి చేసిన కామెడీ ఎంటర్టైనర్. ప్రియదర్శి - నిహారిక NM మధ్య కెమిస్ట్రీ, దర్శకుడు విజయేంద్ర చెప్పిన కథ చెప్పే విధానం సినిమా ప్రధాన ఆకర్షణలుగా నిలవబోతున్నాయి.
ఈ చిత్రంలో వీరిద్దరితో పాటు విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, వి.టి.వి. గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా, బ్రహ్మానందం ఒక ప్రత్యేక పాత్రలో సందడి చేయనుండటం సినిమాకు మరింత హైలైట్‌గా మారనుంది.
ఈ దీపావళికి కుటుంబమంతా కలిసి చూసే సరదా సినిమా కోసం ఎదురుచూస్తున్న వారికి “మిత్ర మండలి” పక్కా ఎంటర్టైనర్‌గా మారే అవకాశముంది. ఫుల్ లెంగ్త్ కామెడీ, స్నేహం, మంచి పాటలు, మల్టీ-స్టార్ కాస్ట్‌తో సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చేలా ఉంది. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, ఒక రోజు ముందే ప్రీమియర్లతో అదరగొట్టేందుకు సిద్ధంగా ఉంది.