HBD Anupama
HBD Anupama: 'రావణాసురుడి వాళ్ళావిడ కూడా వాళ్ల ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది''.. ఈ ఒక్క డైలాగ్ తో తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది అనుపమ. తెలుగులో శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కార్తికేయ2, ఉన్నది ఒకటే జిందగీ, రాక్షసుడు, 18 పేజెస్ వంటి సినిమాలు ఈ కర్లీ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అప్పటివరకూ హోమ్లీగా కనిపించిన అనుపమ..రీసెంట్ గా 'టిల్లు స్క్వేర్' లో తన హాట్ షోతో చెమటలు పట్టించింది. ఇందులో స్టార్ బాయ్ సిద్ధుతో రొమాన్స్ చేసి కుర్రకారును బాగా అట్రాక్ట్ చేసింది.
Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్
'పరదా' టీమ్ విషెష్
రింగు రింగుల జుట్టు, అందమైన నవ్వుతో యూత్ హృదయాలను దోచేస్తున్న ఈ ముద్దుగుమ్మ నేడు తన 29వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అనుపమ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పరదా' నుంచి స్పెషల్ వీడియోను షేర్ చేశారు మేకర్స్. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది. ముగ్గురు మహిళల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. '' పరదాలో 'సుబ్బు' పాత్రకు ప్రాణం పోశారు. ఈ ప్రపంచం కూడా కూడా దానిని చూసే వరకు వేచి ఉండలేము'' అంటూ అనుపమకు బర్త్ డే విషెష్ తెలిజేసింది టీమ్.
Also Read: Hansika Photos: అబ్బా.. దేశీ లుక్ లో యువరాణిలా ముస్తాబైన హన్సిక.. చూస్తే ఫ్లాట్
'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ నటి దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సుబ్బు అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ అద్భుతంగా నటించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా 'పరదా' మరో రెండు సినిమాలు చేస్తోంది.
Also Read: Thandel Viral video: 'తండేల్' థియేటర్లో సాయిపల్లవి స్టెప్పులేస్తూ కుర్రోళ్లు రచ్చ రచ్చ ..!