Hari Hara Veera Mallu Review: ఒట్టు.. ‘హరిహర వీరమల్లు’ సూపర్ హిట్టు.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. కారణాలివే!

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కల్యాణ్ నటించిన తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా, సినీ, రాజకీయ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

New Update
Hari Hara Veera Mallu Super Hit became this is Main reasons

Hari Hara Veera Mallu Super Hit

Hari Hara Veera Mallu Review: ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కల్యాణ్ నటించిన తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది(HHVM Bookings). ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా, సినీ, రాజకీయ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Hari Hara Veera Mallu

పవన్ కల్యాణ్ కేవలం ఒక సినీ హీరోగానే కాకుండా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా(Deputy CM Pawan Kalyan) కీలకమైన రాజకీయ పదవిలో ఉన్నారు. ఈ కొత్త హోదాలో విడుదలవుతున్న మొదటి సినిమా ఇదే కావడంతో ‘హరిహర వీరమల్లు’పై భారీ అంచనాలు ఉన్నాయి. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

ఇది మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ చివరగా ‘భీమ్లా నాయక్’ (2022) సినిమాలో కనిపించారు. ఇదే పవన్ ఆఖరి చిత్రం. ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం తర్వాత పవన్ కీలక పాత్రలో నటించిన ‘బ్రో’(Bro Movie) మూవీ వచ్చినా పెద్దగా క్లిక్ కాలేదు. దీంతో మూడేళ్లకు పైగా విరామం తర్వాత పవర్ స్టార్ వెండితెరపై కనిపించనుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

అంతేకాదండోయ్.. పవన్ కల్యాణ్ ఒక చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలో నటించడం ఇదే మొదటిసారి కావడంతో అంతా ఆసక్తిగా, ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ చాలా సినిమాల్లో పోలీస్‌, నక్సలైట్‌, లవర్ బాయ్‌, పవర్ ఫుల్ జర్నలిస్ట్‌, లాయర్‌‌తో సహా దేవుడి పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను, అభిమానులను అలరించారు. తొలిసారి పవన్ కల్యాణ్ ఒక ధర్మం కోసం నిలబడే యోధుడి పాత్రలో కనిపించనుండటంతో ఫ్యాన్స్‌ మరింత ఉత్సాహంతో ఉన్నారు. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

కాగా పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ప్రమోషన్లలో పాల్గొనడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే పేరుంది. తన గత చిత్రాలైన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ వంటి సినిమాలకు కూడా ఆయన పూర్తిస్థాయిలో ప్రమోషన్లలో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ ప్రమోషన్లలో పాల్గొనడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అందులోనూ పవన్ ఈ మూవీకి ఇచ్చిన బూస్ట్ అభిమానులను పిచ్చెక్కించేలా చేశాయి. హరిహర వీరమల్లు చిత్రం ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని పూర్తి నమ్మకంతో చెప్పడంతో ఈ మూవీపై మరింత బజ్ క్రియేట్ అయింది. 

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

Advertisment
తాజా కథనాలు