Shrasti Verma: కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మకు బిగ్ షాక్.. పోలీస్ కేసు నమోదు!

కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ పై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో స్వాతంత్ర సమరయోధుల గురించి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గుంటూరు జిల్లా NSUI విద్యార్ధి సంఘం నాయకులు కేసు పెట్టారు. వెంటనే ఆమెపై FIR నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

New Update
Shrasti Verma

Shrasti Verma Photograph: (Shrasti Verma)

Shrasti Verma:  కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా గుంటూరు జిల్లా NSUI సంఘం నాయకులూ ఆమెపై కేసు పెట్టారు. సోషల్ మీడియాలో స్వాతంత్య్ర సమరయోధులుపై శ్రేష్టి వర్మ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మహాత్మా గాంధీ, జవహార్ లాల్ నెహ్రులను తీవ్రంగా దూషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: HIT 3 Collections: 'హిట్ 3' దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి!

స్వాతంత్ర సమరయోధులను దూషిస్తూ 

పలు వెబ్ సైట్ కథనాల ప్రకారం.. ''శ్రేష్టి వర్మ తన సోషల్ మీడియాలో  నెహ్రు, గాంధీలను బాస్టర్స్ అని సంభోధించింది. అలాగే రాబోయే తరం ఈ బాస్టర్స్ గురించి కాకుండా,  నిజమైన  స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలుసుకోవాలని  పేర్కొంది. అంతేకాదు బుక్స్ నుంచి వీరి గురించి తెలిపే అధ్యయనాలు, పాఠాలను తొలగించాలని రాసుకొచ్చింది. ఎందుకంటే వారు దేశం మొత్తం నాశనం చేశారు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.''

Also Read: Miss World 2025: హైదరాబాద్ లో 20 రోజుల పాటు కళ్ళు చెదిరేలా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే

పోలీస్ కేసు 

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు సంఘాల నాయకులు శ్రేష్టి వర్మ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   గుంటూరు జిల్లా NSUI అధ్యక్షులు  షేక్.కరీం  ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర సమరయోధుల పై గౌరవం లేకుండా.. వారి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం సమంజసం కాదు. వెంటనే ఆమెపై FIR నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని   పోలీసులకు విజ్ఞప్తి చేశారు NSUI నాయకులు.  

telugu-news | cinema-news | latest-news | Choreographer Shrasti Verma | jani master shrasti verma 

Also Read: 2025 Met Gala: ఇదే ఫస్ట్ టైమ్.. 'మెట్ గాలా' 2025 వేదికపై కియారా బేబీ బంప్ లుక్.. ఫొటోలు చూశారా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు