Puri Sethupathi: ఫుల్ స్వింగ్ లో పూరి-సేతుపతి ప్రాజెక్ట్.. మ్యూజిక్ కోసం ఆస్కార్ విన్నర్ రంగంలోకి!

'లైగర్'  సినిమాతో భారీ డిజాస్టర్ చవిచూసిన పూరి జగన్నాథ్.. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా మరో కొత్త ప్రాజెక్ట్ తో సిద్ధమవుతున్నారు. '#పూరి సేతుపతి'  వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

New Update
puri sethupathi

puri sethupathi

Puri Sethupathi:  'లైగర్'  సినిమాతో భారీ డిజాస్టర్ చవిచూసిన పూరి జగన్నాథ్(Puri Jagannath).. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా మరో కొత్త ప్రాజెక్ట్ తో సిద్ధమవుతున్నారు. '#పూరి సేతుపతి'  వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. దీంతో సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్లతో ఆసక్తి పెంచుతున్నారు మేకర్స్. 

ఆస్కార్ విన్నర్ రంగంలోకి 

తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు పూరి టీమ్. ఆస్కార్ అవార్డు  విజేత హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నట్లు వెల్లడించారు. యాక్షన్, ఎమోషన్,  ఔన్నత్యాన్ని మిళితం చేసే కొత్త సంగీత అనుభవం కోసం సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ హర్ష వర్ధన్ గతంలో సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి, యానిమల్, కబీర్ సింగ్, జార్జ్ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రస్తుతం ప్రభాస్- సందీప్ కాంబోలో తెరకెక్కుతున్న 'స్పిరిట్'  సినిమాకు కూడా అతడే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. 

Also Read: Bigg Boss 9 Telugu: ఫైర్ స్ట్రామ్ ప్రోమో.. అందరు హోస్టులు ఒకే స్టేజ్ పై! పచ్చళ్ళ పాప, మాధురి రచ్చ రచ్చ!

Advertisment
తాజా కథనాలు