Rohit Basfore అడవుల్లో ' ఫ్యామిలీ మ్యాన్ ' నటుడు అనుమానాస్పద మృతి!

'ఫ్యామిలీ మ్యాన్ 3'లో నటుడు రోహిత్ బాస్ఫోర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రోహిత్ నిన్న మిత్రులతో కలిసి అడవి ప్రాంతానికి వెళ్లగా.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాస్ఫోర్ మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

New Update
family man 3 actor Rohit Basfore found dead news Garbhanga Waterfalls

family man 3 actor Rohit Basfore found dead news Garbhanga Waterfalls

ప్రముఖ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 3 లో నటించిన బాలీవుడ్ నటుడు రోహిత్ బాస్‌ఫోర్ అస్సాం గౌహతి సమీపంలోని గర్భంగ జలపాతాల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. 

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

అసలేం జరిగింది.. 

రోహిత్ ఆదివారం మధ్యాహ్నం  12:30 సమయంలో తన స్నేహితులతో చిన్న ట్రిప్‌కి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపారు. కానీ ఆ తర్వాత అతడు తిరిగి ఇంటికి రాలేదు. సాయంత్రానికి అతడి స్నేహితుల ద్వారా రోహిత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ సంఘటన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిందని తెలిపారు. తన తొమ్మిది మంది సహోద్యోగులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన  రోహిత్ ప్రమాదవశాత్తూ జలపాతంలో పడిపోయాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం..జిప్ లైన్ ఆఫరేటర్ పై ఎన్ఐఏ ఫోకస్

ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

కుటుంబ సభ్యుల అనుమానం 

అయితే రోహిత్ తల, ముఖం, శరీరంలోని ఇతర భాగాలపై బలమైన గాయాలు ఉండడంతో..  అతడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు.  కొంతకాలం క్రితం పార్కింగ్ విషయంలో గొడవ జరగగా..  ఆ సమయంలో రంజిత్ బాస్‌ఫోర్, అశోక్ బాస్‌ఫోర్, ధరమ్ బాస్‌ఫోర్ అనే ముగ్గురు వ్యక్తులు రోహిత్‌ కి హాని కలిగించినట్లు ఆరోపించారు. అలాగే రోహిత్ ని ట్రిప్ కి పిలిచినా జిమ్ ట్రైనర్ అమర్ అమర్‌దీప్  పై కూడా అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ నలుగురు రారీలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

గతంలో మరో నటుడు  ఆసిఫ్ బస్రా 

ఇదిలా ఉంటే  కొంతకాలం క్రితం ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించిన ఆసిఫ్ బస్రా కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆయన ఓ మ్యారేజ్ కౌన్సిలర్ పాత్ర పోషించారు. దర్శకులు రాజ్ & డీకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు.  “ఆసిఫ్ బస్రా అద్భుతంగా నటించారు. ఆయన మృతిని తట్టుకోలేకపోయాము'' అని పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

telugu-news | cinema | cinema-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు