/rtv/media/media_files/2025/01/31/7NfMDNARN0khR2ChX8VH.jpg)
Facial Recognition Test
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదురుకుంటున్న బంగ్లాదేశ్‌కు చెందిన మొహమ్మద్ షరీఫుల్‌ను ఫేస్ రికగ్నిషన్ టెస్ట్ ద్వారా పాజిటివ్‌గా గుర్తించారు ముంబై పోలీసులు. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న ఫోటోతో షరీఫుల్ ఫోటో మ్యాచ్ అయింది. నిందితుడికి కాలినా ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఫోరెన్సిక్ అధికారులు ఫేషియల్ రికగ్నిషన్ టెస్ట్ నిర్వహించారు. జనవరి 16న నటుడిని కత్తితో పొడిచిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ అపార్ట్‌మెంట్ మెట్లపై నుండి దిగుతున్న వ్యక్తి ఫోటో, షరీఫుల్ ఇస్లాం ఫోటోతో సరిపోలిందని వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలో పాజిటివ్‌గా తేలిందని స్పష్టం చేశారు. ఈ టెస్టుతో ముంబయి పోలీసులు తప్పుడు వ్యక్తిని అరెస్టు చేశారనే ఊహాగానాలకు చెక్ పడినట్లు అయింది. దీంతో పోలీసులు తరువాత ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.
Also Read: USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు
Also Read: USA: ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లో సిబ్బంది కొరత...వాషింగ్టన్ ప్రమాదానికి కారణం ఇదే..
20 మందికి పైగా పోలీసు బృందాలు
సైఫ్ అలీఖాన్ పై దాడి తరువాత 20 మందికి పైగా పోలీసు బృందాలు మూడు రోజుల పాటు నిందితుడి కోసం సెర్చ్ చేసి జనవరి 19న థానేలో షరీఫుల్ ను అరెస్ట్ చేయగా ప్రస్తుతం జ్యుడీషియల్ అతను కస్టడీలో ఉన్నాడు. షరీఫుల్ అరెస్టు తర్వాత, బంగ్లాదేశ్‌లోని అతని తండ్రి సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న వ్యక్తి తన కొడుకు కాదని, తన కొడుకు పొలికలు ఉన్నాయని ఇందులో ఇరికించారంటూ ఆరోపించారు. సైఫ్ అలీఖాన్ నివాసం నుండి సేకరించిన వేలిముద్రలు నిందితుడి వేలిముద్రలతో సరిపోలడం లేదని వాదనలు కూడా వినిపించాయి. ఇక ఈ ఘటనలో గాయపడిన నటుడు సైఫ్ అలీఖాన్ కు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో రెండు శస్ర్తచికిత్సలు జరిగాయి. ఐదు రోజుల తరువాత సైఫ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Also Read : పెళ్లి ఆగింది.. ఉద్యోగం పోయింది.. సైఫ్ కేసులో అమాయకుడి జీవితం నాశనం!
Also Read : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైర్ పగిలి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!