ఆ సినిమా ఇప్పుడొచ్చుంటే పాన్ ఇండియా హిట్ అయ్యేది.. రామ్ చరణ్ మూవీపై దుల్కర్

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'రంగస్థలం' మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' 'రంగస్థలం' సినిమాలో చరణ్ అద్భుతంగా యాక్ట్ చేశాడు. సినిమాకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు వచ్చి ఉంటే పాన్ ఇండియా సక్సెస్ అయ్యేది..' అంటూ చెప్పుకొచ్చారు.

New Update
dq

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు (Dulquer Salmaan) తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. 'సీతారామం' సినిమాతో ఈ హీరో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఈ దీపావళికి 'లక్కీ భాస్కర్' (Lucky Baskhar) మూవీతో రాబోతున్నాడు. దుల్కర్ నటించిన రెండో తెలుగు సినిమా ఇది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. 

అక్టోబర్ 31 న థియేటర్స్ లో సందడి చేయబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దుల్కర్.. రామ్ చరణ్ (Ramcharan) 'రంగస్థలం' మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Also Read : మోక్షజ్ఞ కు జోడిగా స్టార్ హీరోయిన్ కూతురు..?

Also Read: 'పుష్ప 2' రిలీజ్ డేట్ మారిందోచ్.. బన్నీ కొత్త లుక్ మాములుగా లేదుగా

కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ అవ్వలేదు..

రీసెంట్‌గా మీరు చూసిన సినిమాల్లో ఏది బాగుందని యాంకర్ అడగ్గా.. దానికి దుల్కర్ స్పందిస్తూ.." రీసెంట్‌గా కాదు కానీ రంగస్థలం సినిమాని ఇటీవల మళ్లీ చూశాను. అది ఒక సూపర్ హిట్ మూవీ. చరణ్ అద్భుతంగా యాక్ట్ చేశాడు. సినిమాలో మంచి ట్విస్టులు ఉన్నాయి అవి ఊహించలేదు కూడా. అది మన రూటెడ్ చిత్రం. ఇటీవల మన కథలు, విలువలు ఉన్న సినిమా. అయితే ఇటీవల వచ్చినవన్నీ పాన్ ఇండియా మూవీస్ సక్సెస్ అవుతున్నాయి. ‘రంగస్థలం’ కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ అవ్వలేదు అని అనుకుంటున్నాను. ఆ సినిమాకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు వచ్చి ఉంటే పాన్ ఇండియా సక్సెస్ అయ్యేది.." అంటూ చెప్పుకొచ్చారు. 

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

దీంతో దుల్కర్ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ విన్న మెగా ఫ్యాన్స్ దుల్కర్ చెప్పింది నిజమేనని, 'రంగస్థలం' ఇప్పుడు వచ్చి ఉంటే నిజంగానే పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయ్యేదని కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్ - రామ్ చరణ్ కాంబోలో వచ్చిన 'రంగస్థలం' 2018 విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి.

Also Read : ప్రభాస్ - సమంత కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు