గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ మధ్యలోనే బయటకు రానున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే వన్యప్రాణుల రక్షణ చట్టం నిబంధనలు ఉల్లంఘించారంటూ గంగవ్వ పై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఎదుర్కోవడానికి ఆమెను బయటకు పంపే అవకాశం ఉందని టాక్.

New Update

Bigg Boss Telugu 8:   సీజన్ 4లో అనుకోని పరిస్థితుల కారణంగా షో మధ్యలోనే వెళ్ళిపోయిన గంగవ్వకు.. బిగ్ బాస్ మరోసారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. ఇక వచ్చిన మొదటి రోజే అవ్వ.. అవినాష్ టాస్క్ ఆడి గెలిచి సూపర్ అనిపించుకుంది.

హౌస్ నుంచి బయటకు 

ఇది ఇలా ఉండగా..  ఊహించని విధంగా గంగవ్వ  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రానున్నట్లు ప్రస్తుతం నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే గంగవ్వ, యూట్యూబర్ రాజు  పై వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదవగా.. దానికి సంబంధించిన విచారణ ఎదుర్కోవడానికి గంగవ్వను హౌజ్ నుంచి బయటకు పంపే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మే 20,2022న 'మై విలేజ్ షో'  యూట్యూబ్ ఛానెల్‌లో గంగవ్వ చిలుక పంచాంగం వీడియో అప్‌లోడ్ చేయగా.. అందులో జ్యోతిష్యం చెప్పడానికి చిలుకను బంధించారు. దీంతో యానిమల్ వెల్ఫేర్ మెంబర్ గౌతమ్..  వినోదం కోసం పక్షులను ఉపయోగించడం సరికాదని, వీడియోలో పాల్గొన్న గంగవ్వ, రాజు పై కేసు పెట్టారు.

Also Read: ఎంతోమంది హీరోయిన్స్ తో నటించినా.. వీళ్లిద్దరే ప్రభాస్ ఫేవరేట్

 ఒకప్పుడు వ్యవసాయ కూలీ అయిన గంగవ్వ.. ఇప్పుడు అతి పెద్ద సెలెబ్రెటీగా మారింది. 'మై విలేజ్ షో'  అనే ఛానెల్ లో పల్లెటూరి వీడియోలో చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. 60 ఏళ్ళ వయసులో కూడా చలాకీగా వీడియోలు చేస్తూ, గలగలా మాట్లాడే గంగవ్వ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది. అదే పాపులారిటీ తో  బిగ్ బాస్ లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది. 

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

Also Read:  అనుష్క కాదు, కాజల్ కాదు.. ప్రభాస్ కి సరైన జోడీ ఈ హీరోయినే!

Advertisment
Advertisment
తాజా కథనాలు