/rtv/media/media_files/2024/10/24/Jgc10znezOJd4Yxwi7Gn.jpg)
Pushpa 2 - The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2' రిలీజ్ డేట్ మరోసారి మారింది. సినిమాను డిసెంబర్ 6 న రిలీజ్ చేస్తామని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతుంది. కానీ కొద్ది రోజులుగా రిలీజ్ డేట్ ను మారుస్తున్నట్లు వార్తలు తెగ వినిపించాయి.
ఒక్క రోజు ముందుగానే..
ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. 'పుష్ప 2' రిలీజ్ డేట్ ను ఒక్క రోజు ముందుకు జరిపారు. అంటే డిసెంబర్ 5 నే సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ విషయంపై నిర్మాతలు నేడు ప్రెస్ మీట్ నిర్వహించి మరీ క్లారిటీ ఇచ్చారు. అలాగే నయా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ 'పుష్ప 2' నుంచి అదిరిపోయే పోస్టర్ వదిలారు. ఒక రోజు ముందే రికార్డుల వేట, పుష్ప రాజ్ పాలన ప్రారంభం కానుంది అనే పవర్ ఫుల్ క్యాప్షన్ జత చేశారు.
Also Read: అల్లు అర్జున్ కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. ఫ్యాన్స్ అంతా ఒక్కటే
The celebrations begin a day earlier 🥳
— Mythri Movie Makers (@MythriOfficial) October 24, 2024
The fireworks at the box office will set off a day earlier 🔥
The records will be hunted down a day earlier 💥
Pushpa Raj's Rule will begin a day earlier ❤🔥
The Biggest Indian Film #Pushpa2TheRule GRAND RELEASE WORLDWIDE ON 5th… pic.twitter.com/iF11Vr8ucT
Also Read : ఆ సినిమా ఇప్పుడొచ్చుంటే పాన్ ఇండియా హిట్ అయ్యేది.. రామ్ చరణ్ మూవీపై దుల్కర్
పుష్పరాజ్ లుక్ అదిరింది..
ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లుక్ వేరే లెవెల్ లో ఉంది. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ నోట్లో సిగార్, చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ఇక ఈ అప్డేట్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పుష్ప 2 చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు.
Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి
నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటించగా.. ఫహద్ ఫాసిల్, ధనంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : మోక్షజ్ఞ కు జోడిగా స్టార్ హీరోయిన్ కూతురు..?