Dude Box Office Collections: సెంచరీ కొట్టిన 'డ్యూడ్'.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జాతర!

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డ్యూడ్' బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. దీపావళి బాక్సాఫీస్ రేసులో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆరు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది.

New Update
Dude Box Office collections

Dude Box Office collections

Dude Box Office Collections: యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డ్యూడ్' బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. దీపావళి బాక్సాఫీస్ రేసులో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆరు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద 'డ్యూడ్' సెంచరీ కొట్టాడు అంటూ పోస్టర్ పంచుకున్నారు.  దీపావళికి విడుదలైన నాలుగు సినిమాల్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని మేకర్స్ తెలిపారు. 'డ్యూడ్'  సినిమాతో ప్రదీప్ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో  వరుసగా మూడు చిత్రాలు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 15-16 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. దీపావళి పండగ సీజన్, లాంగ్ వీకెండ్ కావడంతో వసూళ్లు గమనీయంగా పెరిగాయి. 

Also Read :  రెడ్ డ్రెస్ లో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బ్యూటీ.. రకుల్ ఫొటోలు చూస్తే ఫ్లాట్!

డ్యూడ్  ఆక్యుపెన్సీ 

6వ రోజు కూడా  'డ్యూడ్' డీసెంట్ ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తమిళ్లో ఉదయం షోలు 19.52%% ఆక్యుపెన్సీతో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం షోలు 37.08%,  సాయంత్రం, రాత్రి షోలు  31.17% , 31.84% అక్యుపెన్సీతో స్థిరంగా ఉన్నాయి. తెలుగులో ఉదయం, మధ్యాహ్నం అన్ని షోలు కలిపి మొత్తం 16.01% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నారు కుర్ర హీరో ప్రదీప్. 

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్  కీర్తీశ్వరన్ తెరకెక్కించారు. ఒక కొత్త కాన్సెప్ట్ తో రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో హీరో హీరోయిన్ ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్ అలరించింది. 'ప్రేమలు'  బ్యూటీ మమిత బైజు మరోసారి తన నటనతో ఫిదా చేసింది. 

Also Read: Megastar MSVPG: క్రేజీ కాంబో.. 'మన శంకర వరప్రసాద్' వెంకీమామ ఎంట్రీ! గ్లిమ్ప్స్ అదిరింది

Advertisment
తాజా కథనాలు