/rtv/media/media_files/2025/10/23/msvpg-update-2025-10-23-15-44-52.jpg)
MSVPG Update
Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుస్తున్న 'మన శంకర వరప్రసాద్' సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. స్టార్ హీరో వెంకీ మామ ఈ ప్రాజెక్టులో బాగమైనట్లు అనౌన్స్ చేశారు. ఈమేరకు వెంకటేష్ కి వెల్కమ్ చెబుతూ చిన్న గ్లిమ్ప్స్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. మన శంకర వరప్రసాద్' లో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రేజీ కాంబోలో ఫ్యాన్స్ కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగింది.
Welcoming my dear friend, Victory @VenkyMama to our #ManaShankaraVaraPrasadGaru Family 💐💐💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2025
Let’s celebrate the joy this Sankranthi 2026 in theatres 🤗 pic.twitter.com/3kITC2RlBU
మొదటి సారి వెంకీ- చిరు
గ్లిమ్ప్స్ వీడియోలో చిరంజీవి వెల్కమ్ మై బ్రదర్ అంటూ వెంకటేష్ ని స్వాగతించగా.. మై డియర్ చిరు సర్ అంటూ ఆయనను ఆప్యాయంగా హత్తుకున్నారు వెంకటేష్. మెగాస్టార్ చిరంజీవి - వెంకటేష్ మొదటిసారి ఒకే స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. దీంతో వీరిద్దరి కాంబో ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇందులో మెగాస్టార్ ఒక అల్లరి మొగుడిగా, ఫ్యామిలీ మెన్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. అప్పటి ఘరానా బుల్లోడు, రౌడీ అల్లుడు పాత్రల తరహాలో కనిపిస్తూ వింటేజ్ వైబ్స్ అందించనున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి', గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూడవ చిత్రమిది. ఇటీవలే మూవీ నుంచి నయన్- మెగాస్టార్ రొమాంటిక్ సాంగ్ 'మీసాల పిల్లా' పాట విడుదల చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. పాటలో చిరంజీవి, నయన్ లుక్స్, కెమిస్ట్రీ ఆకట్టుకున్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Also Read: Pournami Re Release: 'పౌర్ణమి' సీన్ రీ క్రియేట్.. తలపై దీపం పెట్టుకుని థియేటర్లో రచ్చ రచ్చ..!