Brain Surgery : బేగంపేట్ కిమ్స్ సన్ షైన్ ఆస్పత్రిలో ఓ రోగికి పుష్ప సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేశారు వైద్యులు. నిజామాబాద్ కు చెందిన ప్రతీప్ 30 ఏళ్ళు కొన్నేళ్లుగా అరబ్ దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే గత రెండు నెలలుగా ప్రతీప్ కి తరచూ ఫిట్స్ వస్తుండడంతో అక్కడే చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ తన సమస్య నయం కాకపోవడంతో అక్కడికి ఇండియాకు వచ్చాడు. అనంతరం ప్రతీప్ బేగంపేట్ కిమ్స్ సన్ షైన్ వైద్యులను సంప్రదించగా.. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో ఎడమవైపు ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు.
Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా
పుష్ప సినిమా చూపిస్తూ..
ప్రతీక్ ట్యూమర్ తొలగించడానికి వైద్యులు నావిగేషన్ గైడెడ్ అవేక్ క్రానియోటమి ద్వారా ఫంక్షనల్ న్యూరో సర్జరీ పద్ధతిలో రోగికి శస్త్రచికిత్స పద్దతిని అనుసరించారు. దీని కోసం రోగిని శస్త్ర చికిత్స సమయంలో మెలకువగా ఉంచేందుకు.. అతనికి ట్యాబ్ లో పలు సినిమా పాటలు, జంతువులను చూపిస్తూ.. వాటిని గుర్తిస్తున్నాడా, అర్థం చేసుకుంటున్నాడా అనేది గమనిస్తూ ఆపరేషన్ చేశారు. ఈ సర్జరీ రెండు గంటల పాటు కొనసాగింది.
Also Read : పెళ్లి పేరుతో మైనర్ బాలికను తల్లిదండ్రులు.. ఏం చేశారంటే?
గతంలో కూడా..
ఇది ఇలా ఉంటే గతంలో తొండంగి మండలం కొత్తపల్లికి చెందిన అనంతలక్ష్మి అనే బ్రెయిన్ మహిళకు కూడా ఇలాంటి సర్జీరీనే చేశారు. బ్రెయిన్ ట్యూమర్‌ను తొలగించడానికి వైద్యులు అవేక్ క్రానియోటమీ పద్దతిని అనుసరించారు. ఇందుకోసం పేషంట్ ను మెలుకువగా ఉంచడానికి తనకు ఎంతో ఇష్టమైన జానియర్ ఎన్టీఆర్ 'అదుర్స్' సినిమాలోని బ్రహ్మానందం- ఎన్టీఆర్ కామెడీ సీన్లను చూపిస్తూ ఆపరేషన్ చేశారు. కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ రెండున్నర గంటల పాటు జరిగిన ఆపరేషన్ విజయవంతం అయ్యింది. ఆ మహిళా మరో ఐదు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి శస్త్ర చికిత్స ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా జరగడంపై డాక్టర్లను అందరూ అభినందిస్తున్నారు.
Also Read: HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా?
Also Read : ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా