/rtv/media/media_files/2024/11/06/vishnu-priya1.jpg)
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణు.. ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెర పై అడుగుపెట్టింది. తన కామెడీ టైమింగ్, చలాకీతనంతో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credits: VIshnupriyaa/ Instagram
/rtv/media/media_files/2024/11/06/vishnu-priya5.jpg)
2017లో కమెడియన్ సుదీర్ తో చేసిన 'పోవే పోరా' షో విష్ణు ప్రియకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత యాంకర్ గా పాపులరైన విష్ణు పలు టీవీ షోలు, ఈవెంట్ చేస్తూ బిజీ అయిపొయింది. Image Credits: VIshnupriyaa/ Instagram
/rtv/media/media_files/2024/11/06/vishnu-priya7.jpg)
యాంకరింగ్ మాత్రమే కాదు పలు కన్నడ, తెలుగు సినిమాల్లో కూడా మెరిసింది విష్ణు. చెక్‌మేట్ మూవీలో బోల్డ్ అవతార్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. Image Credits: VIshnupriyaa/ Instagram
/rtv/media/media_files/2024/11/06/vishnu-priya4.jpg)
విష్ణు తెలుగులో ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాల్లో చిన్న పాత్రలో నటించింది. మలయాళంలో 'మయూఖం', తమిళ్లో 'శివప్పతిగరం', కన్నడలో 'గూలి' సినిమాల్లో నటించింది. Image Credits: VIshnupriyaa/ Instagram
/rtv/media/media_files/2024/11/06/vishnu-priya3.jpg)
రీసెంట్ గా విష్ణు, సీరియల్ నటుడు మానస్ కలిసి చేసిన యూట్యూబ్ ఆల్బమ్ 'జరీ జరీ పంచెకట్టు' మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇందులో విష్ణు ప్రియ డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. విష్ణు ప్రియకు డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. Image Credits: VIshnupriyaa/ Instagram
/rtv/media/media_files/2024/11/06/vishnu-priya2.jpg)
విష్ణు పాపులర్ యాక్టర్ జేడీ చక్రవర్తి 'దయా' వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్రలో మెరిసింది. Image Credits: VIshnupriyaa/ Instagram
/rtv/media/media_files/2024/11/06/vishnu-priya8.jpg)
విష్ణు ప్రియా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. విష్ణు తల్లిదండ్రలు ఆమె చిన్న వయసులోనే విడిపోయారు. ఇటీవలే విష్ణు మదర్ అనారోగ్యంతో కన్నుమూశారు. విష్ణు ప్రియకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు పావని. Image Credits: VIshnupriyaa/ Instagram