నేను ఈ స్థాయిలో నిలబడ్డానికి ఆ డైరెక్టరే కారణం: డైరెక్టర్ సుకుమార్
పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్‌లో దర్శకుడు సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ గురించి థాంక్స్ చెప్పాల్సింది కేవలం రాజమౌళికేనని అన్నారు. అంతేకాకుండా ఈ రోజున తాను ఈ స్టేజీపై నిలబడ్డానికి ప్రధాన కారణం రాజమౌళినే అని పేర్కొన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. బన్నీ మ్యానరిజం, స్వాగ్, డైలాగ్ డెలవరీ అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడంతా పుష్ప మేనియానే నడుస్తోంది. ఇందులో బన్నీ యాక్టింగ్‌కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.
డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మూవీ యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో బన్నీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నాకు పేరు వచ్చినా వేరే ఆర్టిస్టులకు పేరు వచ్చిన ఆ క్రెడిట్ అంతా ఒక్కడికే దక్కుతుంది. నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినా సరే అవన్నీ సుకుమార్ కారణంగానే వచ్చాయి. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నామీద సుకుమార్ కి ఉన్న ప్రేమే కారణం. ఇంతకంటే నేనేం చెప్పగలను డార్లింగ్.. దీనికి నేను ఏమి ఇవ్వగలను అంటూ ఎమోషనల్ అయ్యాడు బన్నీ.
అనంతరం తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు రేట్లు పెంచుకోనిచ్చిన ముఖ్యమంత్రులకు థాంక్స్ చెప్పాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్‌కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.
అనంతరం డైరెక్టర్ సుకుమార్ మాట్లాడారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన ఓ దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. తన కెరీర్ గురించి థాంక్స్ చెప్పాల్సింది కేవలం రాజమౌళికేనని అన్నారు. దానికీ ఓ కారణం ఉందన్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ హిందీలో రిలీజ్ చేయించాలని ఆయనే చాలా ప్రయత్నించారని అన్నారు.
అందరికీ ఫోన్లు చేయించి దాన్ని హిందీలో సైతం రిలీజ్ చేయించారని అన్నారు. ఈ రోజున తాను ఈ స్టేజీపై నిలబడ్డానికి ప్రధాన కారణం రాజమౌళినే అని అన్నారు. ప్రస్తుతం సుకుమార్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: కేసీఆర్ కు ఆహ్వానం అందించిన మంత్రి పొన్నం..!
బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు
డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మూవీ యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో బన్నీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నాకు పేరు వచ్చినా వేరే ఆర్టిస్టులకు పేరు వచ్చిన ఆ క్రెడిట్ అంతా ఒక్కడికే దక్కుతుంది. నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినా సరే అవన్నీ సుకుమార్ కారణంగానే వచ్చాయి. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నామీద సుకుమార్ కి ఉన్న ప్రేమే కారణం. ఇంతకంటే నేనేం చెప్పగలను డార్లింగ్.. దీనికి నేను ఏమి ఇవ్వగలను అంటూ ఎమోషనల్ అయ్యాడు బన్నీ.
ఇది కూడా చదవండి: ముక్కలయ్యేందుకు సిద్ధంగా కూటమి..హ్యాండ్ ఇస్తున్న మిత్ర పక్షాలు
అనంతరం తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు రేట్లు పెంచుకోనిచ్చిన ముఖ్యమంత్రులకు థాంక్స్ చెప్పాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్‌కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: ఆ గ్రామాలకు జిల్లాలు మార్పు!
ఆ డైరెక్టర్‌కి స్పెషల్ థాంక్స్
అనంతరం డైరెక్టర్ సుకుమార్ మాట్లాడారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన ఓ దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. తన కెరీర్ గురించి థాంక్స్ చెప్పాల్సింది కేవలం రాజమౌళికేనని అన్నారు. దానికీ ఓ కారణం ఉందన్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ హిందీలో రిలీజ్ చేయించాలని ఆయనే చాలా ప్రయత్నించారని అన్నారు.
అందరికీ ఫోన్లు చేయించి దాన్ని హిందీలో సైతం రిలీజ్ చేయించారని అన్నారు. ఈ రోజున తాను ఈ స్టేజీపై నిలబడ్డానికి ప్రధాన కారణం రాజమౌళినే అని అన్నారు. ప్రస్తుతం సుకుమార్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: అండర్ వేర్లు, చెప్పులపై హిందూ దేవుళ్ళ బొమ్మలు.. వాల్ మార్ట్ దుమారం!