ముక్కలయ్యేందుకు సిద్ధంగా  కూటమి..హ్యాండ్ ఇస్తున్న మిత్ర పక్షాలు

2024 ఎన్నికల్లో బీజేపీని కాస్త అయితే ఆపగలిగింది కానీ  అధికారంలోకి రాకుండా చేయలేకపోయింది. తరువాత చాలాచోట్ల జరిగిన ఎన్నికల్లో కూడా  ప్రభావం చూపించలేకపోయింది. దీంతో ఇప్పుడు కూటమిలో చీలికలు మొదలయ్యాయి. నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ ఎక్కువైంది.

New Update
11

బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడంలో కూటమి పక్షాలు బాగా సక్సెస్ అయ్యాయి. దీనివలన ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్క్ ను సాధించలేకపోయింది. అదీ కాకుండా ప్రతిపక్షంలో కాంగ్రెస్ కూర్చోగలిగింది. ఇది కాంగ్రెస్‌కు, దాని మిత్ర పక్షాలకు మంచి ఊపునిస్తుంది...మరింత ముందుకు దూసుకెళ్తాయి అనుకున్నారు అందరూ కానీ..అసలు ఆ ఛాయలే కనిపించడం లేదు. సాధారణ ఎన్నికల తర్వాత కూటమి పార్టీల పరాజయాలు కంటిన్యూ అవుతున్నాయి. కాంగ్రెస్‌తో పాటూ దాని మిత్రపక్షాలు ఘోరంగా ఓడిపోతున్నాయి. 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అంతా కాంగ్రెస్‌దే అనుకున్నారు. సర్వేలు కూడా అదే చెప్పాయి. కానీ చివరకు అంతా తారు మారు అయిపోయింది.  తీరా ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. వారి ఓవర్ కాన్ఫిడెన్స్ వారిని ముంచిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అక్కడ మూడోసారి కూడా బీజేపీనే ఘన విజయం సాధించింది. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే.. మేజర్ పార్ట్‌నర్‌గా ఉన్న కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. 288 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 233 స్థానాలను బీజేపీ కూటమి గెలుచుకుంది. కాంగ్రెస్ 100కి పైగా స్థానాల్లో పోటీ చేసినా కేవలం 16 స్థానాలకు మాత్రమే సంపాదించింది. మరోవైపు జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచినప్పటికీ.. అది పూర్తిగా జేఎంఎం, సీఎం హేమంత్ సొరెన్ ఖతాల్లో పడిపోయింది. కాంగ్రెస్ సొంత బలం కన్నా జేఎంఎం బలంలోనే గెలిచిందనేది ఒప్పుకుని తీరాలి. 

మమతా అయితే బెటర్..

ఈ నేపథ్యంలో కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మీద మిగతా పార్టీల్లో సందేహాలు మొదలయ్యాయి. ఇక మీదట కాంగ్రెస్‌తో జతకట్టడం ఎంత మాత్రం మంచిది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. లేదా కూటమి పగ్గాలు కాంగ్రెస్ చేతిలో కాకుండా మమతా బెనర్జీ చేతిలో పెట్టాలి అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మమతా బెనర్జీ ఎప్పటి నుంచో తాను కూటమిని నడిపించడానికి సిద్ధమేనని చెబుతూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు దీని గురించి గొడవ, ఆ తరువాత ఆమెను బుజ్జగించటాలు లాంటివి కూడా అయ్యాయి. ఇప్పుడు  మళ్ళీ ఇదే వాదన తెరమీదకు తీసుకువస్తున్నాయి మిత్ర పక్షాలు. సమాజ్‌వాదీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఆర్జేడీ, ఎన్సీపీ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇలా ప్రతీ పార్టీ కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. 

మరోవైపు ఆప్ అయితే ఇప్పటికే కాంగ్రెస్‌తో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి వెళ్ళడం లేదు కూడా. మిత్రపక్షాల్లో అర్జేడీ తప్ప మిగతావన్నీ మమతా బెనర్జీకి నాయకత్వం కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.  దీనికి కాంగ్రెస్ మాత్రం ఒప్పుకోవడం లేదు. నాయకత్వం అనేది కూటమి ద్వారా నిర్ణయించబడుతుంది. కూటమిలో ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకోవాలి. ఏ ఒక్క పార్టీ నిర్ణయం కాదు. కూటమిలో 17-18 పార్టీలు ఉన్నాయి. ఏ నిర్ణయమైనా ఏకాభిప్రాయంతోనే తీసుకుంటారు అని కాంగ్రెస్ నాయకుడు తారిఖ్ అన్వర్ అన్నారు. 

Also Read: Bunny: బాబాయ్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పిన బన్నీ

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు