అండర్ వేర్లు, చెప్పులపై హిందూ దేవుళ్ళ బొమ్మలు.. వాల్ మార్ట్ దుమారం!

వాల్ మార్ట్ అండర్ వేర్లు, చెప్పులు, స్విమ్ సూట్స్ పై దేవుళ్ళ బొమ్మలను డిజైన్ చేయడం పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై BJPఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. వాల్ మార్ట్ తక్షణమే క్షమాపణలు చెప్పి.. తమ ఉత్పత్తులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

New Update
WALL MART11

wall mart

Wall Mart: బాయ్‌కాట్‌ వాల్‌మార్ట్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ సోషల్‌మీడియాలో ఓ వరదను తలపిస్తోంది. హిందూ దేవుళ్లను అవమానించేలా వాల్‌మార్ట్‌ విక్రయాలు చేపడుతుందని ఆ వర్గం ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల వాల్‌మార్ట్‌పై చాలా కోపంగా ఉన్నారు.. వాల్‌మార్ట్‌ను బాయ్‌కాట్‌ చేయాలని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు.. ఆయన ఒక్కడే కాదు.. చాలా మంది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు ఇదే డిమాండ్‌తో వరుస పెట్టి పోస్టులు చేస్తున్నారు. ఇంతకీ వాల్‌మార్ట్‌ ఏం చేసింది?

స్విమ్ సూట్స్ , అండర్ వేర్ల పై హిందూ దేవుళ్ళ ప్రతిమలు.. 

అయితే తాజాగా వాల్ మార్ట్ అవాంఛనీయ వస్తువులపై హిందూ దేవుళ్ళ బొమ్మలను ముద్రించడం వివాదాస్పదంగా మారింది. అండర్ వేర్లు, చెప్పులు, స్విమ్ సూట్స్ వంటి ఉత్పత్తులపై  దేవుళ్ళ బొమ్మలను డిజైన్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇలాంటి ఉత్పత్తుల పై  దేవతల చిత్రాలను ముద్రించడం మతగౌరవాన్ని కించపరిచే చర్యగా భావించబడింది. ఇది హిందూ మతాన్ని గౌరవించేవారికి, పూజలు చేసేవారి మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. దీంతో వాల్మార్ట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

ఏపీ బీజేపీ  అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి 

ఈ అంశంపై  ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వాల్ మార్ట్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని. వెంటనే తమ ఉత్పత్తులను తిరిగి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందుత్వాన్ని కించపరిచేలా ఎలాంటి ఘటనలను తాము సహించేది లేదని హెచ్చరించారు. 

గతంలో కూడా.. 

గతంలో కూడా వాల్ మార్ట్ పై ఈ విషయంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. 2020లో వివిధ ఉత్పత్తులపై హిందూ దేవతల చిత్రాలను ముద్రించడం పై భారతదేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.  దీంతో  తమ ఆన్ లైన్ రిటైల్ ప్లాట్‌ఫారమ్‌లలో హిందూ దేవతల చిత్రాలతో చేసిన వస్త్రాలు, స్విమ్‌సూట్స్, స్లిప్పర్స్ వంటి ఉత్పత్తులను ఉపసంహరించుకున్నారు.  ఇప్పుడు మళ్ళీ వాల్ మార్ట్ ఇలాంటి పనే చేయడం వివాదాస్పదంగా మారింది. 

Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు