/rtv/media/media_files/2024/11/20/0xGLELuBw6sLYKBQNwcI.jpg)
RGV: వివాదాస్పద దర్శకుడు ఆర్జీవిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా బ్రాహ్మణి ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడని టీడీపీ నేత రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మద్ధీపాడు పోలీస్ స్టేషన్ లో RGV పై PS 7 సెక్షన్ ల క్రింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో భాగంగా ఈరోజు ఆర్జీవిని పోలీసులు విచారించనున్నారు.
గతంలో డుమ్మా...!
ఇటీవల ఈ కేసులో విచారణకు రావాలని RGV కి నోటీసులు కూడా అందించారు. తొలుత ఈ కేసులో కీలక అంశాలపై విచారించేందుకు విచారణకు నవంబర్ 11న రావాలని ఒంగోలు రూరల్ పోలీసులు నోటిసులు ఇచ్చారు. ఈ క్రమంలో అర్జీవి విచారణకు డుమ్మా కొట్టారు. ముందస్తూ షెడ్యుల్ కారణంగా రాలేనని CI కి వాట్సాప్ ద్వారా.. తన తరపున అడ్వకేట్ ద్వార తెలియజేశారు. తనకు వారం రోజుల సమయం కావాలని కోరారు. అయితే RGV విన్నపం మేరకు పోలీసులు ఈ నెల 25న అంటే ఈరోజు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మరి ఆర్జీవి విచారణకు హాజరవుతారా?, లేదా? అనేది వేచి చూడాలి.
Also Read: Crime: వివాహిత అపహరణ..బంధీగా ఉంచి 14 రోజులుగా అత్యాచారం!
విచారణకు రాలేడు..!
ఈ రోజు RGV కొన్ని అత్యవసర కారణాలు వలన విచారణకు రావడం లేదని అతని తరపున అడ్వకేట్ శ్రీనివాస్ చెబుతున్నారు. విచారణకు మరొసారి RGV సమయం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు అనగా 26.11.24 హైకోర్టు లో ఈ కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. తనపై పెట్టిన కేసులన్నిటిలో బెయిల్ మంజూరు కోరుతూ హైకోర్టు ను RGV ఆశ్రయించారు. ఇప్పటికే ఒకసారి RGV అభ్యర్థనను హై కోర్టు తొసి పుచ్చింది. పోలీసుల విచారణ విషయంలో జోక్యం కలుగజేసుకొబొమని కోర్టు పేర్కొంది. ఇటువంటి పరిస్థితిలో మరొసారి పోలీసులు RGVకి సమయం ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read: కేసీఆర్ మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!
Also Read: మహారాష్ట్ర సీఎం ఎవరూ ? మరికొన్ని గంటల్లో స్పష్టత