Prashanth Neel: RCB విజయంతో ఊగిపోయిన స్టార్ డైరెక్టర్.. ఎన్టీఆర్ సెట్లో సంబరాలు! (వీడియో)

RCB కప్ గెలవడంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంబరాలు చేసుకున్నారు. RCB గెలవగానే ఎగిరి గంతేశారు. ఉత్సాహంతో కేకలు వేస్తూ ఆనందంతో ఊగిపోయారు. ఈ వీడియోను ఆయన భార్య లిఖితా షేర్ చేస్తూ ''క్రేజీ క్రికెట్ ఫ్యాన్‌కి ఇదే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్'' అని రాసుకొచ్చారు.

New Update
Prashanth neel rcb winning celebrations

Prashanth neel rcb winning celebrations

Prashanth Neel: 18 ఏళ్ళ నిరీక్షణ తర్వాత RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఐపీఎల్ ట్రోఫీ(IPL 2025 Trophy) సొంతం చేసుకుంది. దీంతో అభిమానుల నుంచి సెలెబ్రెటీల వరకు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్  స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ప్రశాంత్ నీల్ RCB విజయాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. 

Also Read: HariHara VeeraMallu: పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరోసారి షాక్! 'హరిహరవీరమల్లు' పై కీలక అప్డేట్

ఆనందంతో ఊగిపోయిన ప్రశాంత్

 RCB కప్ గెలవగానే ఎగిరి గంతేశారు. ఉత్సాహంతో కేకలు వేస్తూ ఆనందంతో ఊగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సతీమణి లిఖితా రెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 18 ఏళ్ళ కళ నెరవేరింది.. ఫైనల్లీ ఈసాలా కప్‌ నమ్‌దు. నేను తెలిసిన క్రేజియెస్ట్‌  క్రికెట్ ఫ్యాన్‌ ప్రశాంత్ నీల్ కి  ఇదే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అని రాసుకొచ్చారు. అయితే ఈరోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు ఆమె ఈ వీడియోను షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. 

Also Read: 'చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి' అమర్ దీప్ సినిమాకు టైటిల్ ఫిక్స్

ప్రశాంత్ నీల్ ఈ లైవ్ మ్యాచ్ ని ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'డ్రాగన్' మూవీ సెట్ లో ఎంజాయ్ చేశారు. సెట్లోనే  పెద్ద తెరపై RCB vs పంజాబ్ మ్యాచ్‌ ను వీక్షించారు. ఆయన భార్య లికితా రెడ్డి, చిత్ర యూనిట్ సభ్యులు కూడా చూశారు. తనకెంతో ఇష్టమైన RCB గెలవడంతో సంబరాలు చేసుకున్నారు. 

Also Read: Nushrratt Bharuccha: వర్షపు నీటి జల్లుల్లో బాలీవుడ్ బ్యూటీ అందాల ఆరబోత.. ఫొటోలు చూస్తే మతిపోతుంది

Advertisment
Advertisment
తాజా కథనాలు