Bigg Boss Amar Deep: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరీ, నటి సురేఖ వాణి కూతురు సుప్రీతా హీరోహీరోయిన్లుగా గతేడాది ఓ సినిమాను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ‘చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అమర్, సుప్రీతా ఇద్దరూ తొలిసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. M3 మీడియా బ్యానర్ లో మహేంద్రనాథ్ కొండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ మాల్యాద్రిరెడ్డి తెరకెక్కిస్తున్నారు.
రొమాంటిక్ లవ్ స్టోరీ
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేయగా అమర్, సుప్రీతా రొమాంటిక్ విజువల్స్ తో యూత్ ఫుల్ గా కనిపించింది. ఈ చిత్రంలో సీనియర్ నటులు రాశీ, సురేఖ వాణి, వినోద్ కుమార్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
అమర్ కోయిలమ్మ, 'జానకి కలగనలేదే సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లో ఎంట్రీ ఇచ్చి.. రన్నరప్ గా నిలిచాడు. ఈ షోద్వారా వచ్చిన పాపులారిటీతో.. హీరోగా అవకాశం దక్కించుకున్నాడు. సీరియల్స్, సినిమాలతో పాటు పలు టీవీ షోలతో కూడా అలరిస్తుంటాడు అమర్. ఇదిలా ఉంటే అమర్ సీరియల్ నటి తేజశ్వినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కోయిలమ్మ సీరియల్ ద్వారా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది.
Also Read: HariHara VeeraMallu: పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరోసారి షాక్! 'హరిహరవీరమల్లు' పై కీలక అప్డేట్