HariHara VeeraMallu: 'హరిహర వీరమల్లు' విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశ ఎదురైంది. ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్, సీజీ పనులు ఇంకా పూర్తి కాకపోవడమే దీనికి ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. గ్రాఫిక్స్ వర్క్ విషయంలో రాజీ పడకుండా, సినిమాను మెరుగైన అవుట్‌పుట్‌తో అందించాలని మేకర్స్ భావిస్తున్నారట.
జులైలో కొత్త డేట్
అంతేకాదు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత ఏ.ఎం. రత్నం కూడా సినిమా గురించి ప్రస్తావిస్తూ ఇదే విషయం గురించి మాట్లాడారు. దీంతో మరోసారి విడుదలను వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త విడుదల తేదీ జూలైలో ఉండవచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి. దాదాపు నాలుగేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Announced in 2020.
— LetsCinema (@letscinema) June 3, 2025
Postponed in April 2021.
Delayed again in 2022.
No release in 2023.
2024 elections resulted in delay.
March 28, 2025 — another postponement.
Now just 9 days from June 2025 release…
Postponed again.#HariHaraVeeraMallu pic.twitter.com/ZmrKkH8HI7
ట్రైలర్ పై ఉత్కంఠ
ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. జూన్ 4 నుంచి 8 మధ్యలో ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుమారు రూ. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం . తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మొదలు పెట్టిన ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ పూర్తిచేశారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి, సత్యరాజ్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: RajaSaab Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. రాజాసాబ్ రిలీజ్ డేట్ ఇదే!