Ram Charan Peddi Update: ఒక్కో పాటకు 30 వేరియేషన్స్.. 'పెద్ది'కి ఏ ఆర్ రెహమాన్ బంపర్ ఆఫర్

రామ్ చరణ్ "పెద్ది" ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ AR రెహమాన్ ఈ చిత్రానికి 20-30 వేరియేషన్లతో పాటలు ఇచ్చారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, రామ్ చరణ్ లుక్‌ సినిమాపై హైప్ పెంచుతున్నాయి.

New Update

Ram Charan Peddi Update: గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' ప్రధాన పాత్రలో, ప్రముఖ హీరోయిన్ 'జాన్వీ కపూర్' కథానాయికగా నటిస్తున్న చిత్రం "పెద్ది" ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గ్రామీణ నేపథ్యంలో క్రికెట్‌ను ప్రధాన అంశంగా ఎంచుకున్నారు. షూటింగ్ కొంత ఆలస్యంగా మొదలైనా, ఇప్పుడు వేగంగా సాగుతోంది.

Also Read:ఇలా ఉన్నారేంట్రా అయ్యా..! 'యమదొంగ' రీ-రిలీజ్ లో అలీ గెటప్ రీ క్రియేట్ చేసి రచ్చ రచ్చ..

ఇప్పటికే విడుదలైన "పెద్ది" ఫస్ట్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. రామ్ చరణ్ కొత్త లుక్, బ్యాక్‌డ్రాప్, విజువల్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సానా(Buchi Babu Sana) ఓ ఇంటర్వ్యూలో సినిమా మరియు మ్యూజిక్ అప్‌డేట్స్ పై ఆసక్తికర విషయాలు షేర్ చేశాడు.

Also Read:'రెట్రో' లెక్కలివే.. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్..!

ఒక్కో పాటకు 20 నుంచి 30 వేరియేషన్స్

ఈ సినిమాకు 'ఏ ఆర్ రెహమాన్'(AR Rahman) సంగీతం అందించడమే ప్రత్యేక ఆకర్షణ. సంగీతం విషయంలో ఎప్పుడూ ఖచ్చితంగా ఉండే  రెహమాన్, ఈ చిత్రానికి ప్రత్యేకంగా పాటలు చేశారని బుచ్చిబాబు వెల్లడించారు. ఒక్కో పాటకు 20 నుంచి 30 వేరియేషన్స్ రెహమాన్ తమకు అందించారని, వాటి నుంచి పాటలను ఎంచుకోవడం గొప్ప విషయం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఈ సినిమా 'బ్యాక్‌గ్రౌండ్ స్కోర్' కూడా చాలా గ్రాండ్‌గా ఉంటుందని చెప్పారు.

Also Read:హరి హర వీరమల్లు 3rd సింగిల్ వచ్చేస్తోంది..

రెహమాన్ మ్యూజిక్‌తో పాటు, బుచ్చిబాబు డైరెక్షన్, రామ్ చరణ్ ఎనర్జీ- ఇవన్నీ కలసి "పెద్ది" సినిమాను గ్యారెంటీ హిట్‌గా చేస్తున్నాయి. మేకింగ్ స్టాండర్డ్స్, క్రికెట్ నేపథ్యంలో గ్రామీణ జీవితం, రామ చరణ్ న్యూ అవతార్ ఇవన్నీ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే, "పెద్ది" సినిమా టీమ్ భారీ స్థాయిలో ప్లానింగ్ చేసి, ప్రతీ అంశంలో కసిగా పని చేస్తూ, మ్యూజిక్ నుంచి విజువల్స్ దాకా ఓ క్లాసిక్ మూవీ అనిపించేలా తీర్చిదిద్దుతోంది.

Advertisment
తాజా కథనాలు