Yamadonga Re Release: ఎన్టీఆర్() అభిమానులకు మే నెల పండుగే! మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘యమదొంగ’ సినిమా మళ్లీ మే 18న రీ-రిలీజ్ చేయడంతో, థియేటర్ల వద్ద సందడి అదిరిపోయింది. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయింది. ఇక రీ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు.
Also Read: 'రెట్రో' లెక్కలివే.. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్..!
ఆలీ గెటప్ వేసుకుని థియేటర్‌కు..
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒక అభిమాని కమెడియన్ ఆలీ పాత్ర గెటప్(Yamadonga Ali Getup Viral Video) వేసుకుని థియేటర్‌కు వచ్చి హల్‌చల్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Yamadonga4K Ali Scene Recreated at Vizag melody Theatre 🔥🔥 pic.twitter.com/VRChvZnFZu
— Nellore NTR Fans (@NelloreNTRfc) May 18, 2025
#Yamadonga4k Fan Getups During Rerelease Screening 🤩 pic.twitter.com/jBVs718Uj6
— Nellore NTR Fans (@NelloreNTRfc) May 18, 2025
ఇటీవలే "జగదేక వీరుడు అతిలోక సుందరి" రీ రిలీజ్ సందర్భంగా ఒక అభిమాని 'అమ్రిష్ పురి' గెటప్ వేసుకొని వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు యమదొంగలోని ఆలీ గెటప్ తో మరో అభిమాని మాస్ హంగామా చేయడంతో, థియేటర్లలో మరోసారి పండుగ వాతావరణం నెలకొంది.
Also Read: హరి హర వీరమల్లు 3rd సింగిల్ వచ్చేస్తోంది..
Crowd at Sandya 70MM 💥💥#Yamadonga4K @tarak9999 pic.twitter.com/mmeQX1CswK
— Nellore NTR Fans (@NelloreNTRfc) May 18, 2025
Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్ అదిరింది! (ఫోటోలు)
ఇక ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌గా రెండు కొత్త సినిమా అప్డేట్లు వస్తాయని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. అయితే, చివరి నిమిషంలో "వార్ 2"అప్డేట్‌ను వాయిదా వేయడంతో నిరాశ చెందారు. ఎఎన్టీఆర్-అయాన్ ముఖర్జీ కాంబినేషన్ పై ఉన్న భారీ అంచనాలు ఉండడంతో అప్డేట్ వాయిదా పడేసరికి అభిమానులు కొంత డిస్సపాయింట్ అయ్యారు.
ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం యమదొంగ రీ రిలీజ్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే.. తెలుగు ప్రేక్షకుల రీ-రిలీజ్‌ల పట్ల ఉన్న అభిమానం మరోసారి స్పష్టమవుతోంది. యముడు, చిత్రగుప్తుడు వంటి పాత్రల వేషధారణలో అభిమానులు థియేటర్లకు వస్తూ హంగామా చేస్తున్నారు.
Also Read: మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
రీ రిలీజ్‌లపై ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. ప్రతి సినిమాను పండుగలా మార్చేస్తున్నారు అభిమానులు, తమ నటుడిపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని క్లాసిక్ సినిమాలు తిరిగి తెరపైకి వచ్చి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాయో చూడలి.