/rtv/media/media_files/2025/03/05/ACnf9X3A9HSUFlHIXJhK.jpg)
dil raju take on piracy
Dil Raju Comments: ప్రస్తుతం సినీ పరిశ్రమను పైరసీ భూతం పీడిస్తోంది. ఇది నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. కోట్లు ఖర్చు పెట్టి సినిమాను నిర్మిస్తుంటే.. విడుదలైన ఒక్క రోజులోనే సామాజిక మాధ్యమాల్లో పైరసీ కాపీలు ప్రత్యక్షమవుతున్నాయి. దీని వల్ల సినిమాకు భారీ నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న వచ్చిన గేమ్ ఛేంజర్ నుంచి ఇటీవలే విడుదలైన తండేల్ వరకు అన్ని సినిమాలను పైరసీ భూతం పీడించింది.
Also Read: అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
ఉద్యమం రావాలి..
అయితే తాజాగా ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సినిమాలను పైరసీని అరికట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తే అవి పైరసీకి గురై నిర్మాతలు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీని అరికట్టేందుకు ఓ ఉద్యమం రావాలి అని అన్నారు. ఈ విషయంలో నటీనటులు, హీరోలు తనకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను పైరసీ భూతం పీడిస్తోందని తెలిపారు. పైరసీని అరికట్టేందుకు FDC చైర్మన్‌గా తాను ఉద్యమాన్ని లీడ్ చేస్తానని చెప్పారు. దీనికోసం నిర్మాతలు అంతా కలిసి రావాలి.. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో ఉన్నవారు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని నిర్మాత దిల్ రాజ్ పిలుపునిచ్చారు.
Also Read: ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..
Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!
Follow Us