/rtv/media/media_files/2025/02/02/7RYlcxPr2nXpgFDPfr2u.jpg)
arun vijay
తమిళ్ స్టార్ ధనుష్ (Danush) 52వ చిత్రంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ఇడ్లీ కడాయి' (Idli Kadai). ధనుష్ సొంత బ్యానర్ వండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం దర్శకుడిగా వహిస్తున్నారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈమూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలారు.
Also Read: Thandel Movie: తండేల్ లో ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ.18 కోట్లు ఖర్చు చేశారట.. ఏంటో తెలిస్తే షాకే !
Great to work with such a hardworking, dedicated and sincere actor @arunvijayno1 brother #Idlykadai pic.twitter.com/y0W2NnWpiF
— Dhanush (@dhanushkraja) February 1, 2025
కీలక పాత్రలో అరుణ్ విజయ్
తాజాగా ఈ మూవీలో విలక్షణ నటుడు అరుణ్ విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ చేతిలో బాటిల్ పట్టుకొని అరుణ్ తో బాక్సింగ్ రింగ్ లో కనిపించడం ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నిత్యా మీనన్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇప్పటికే ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'రాయన్' బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ సినిమాతో పాటు మరోవైపు తెలుగులో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న 'కుబేర' చిత్రం చేస్తున్నారు ధనుష్. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే టీజర్, పోస్టర్ లతో సూపర్ బజ్ క్రియేట్ చేసిన ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
Also Read : జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్ళు...ఎంత వచ్చిందంటే..
Fatima Sana Shaikh: ఆ తెలుగు నిర్మాతలు నన్ను వేధించారు.. ప్రముఖ నటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!