Fatima Sana Shaikh: ఆ తెలుగు నిర్మాతలు నన్ను వేధించారు.. ప్రముఖ నటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

నటి ఫాతిమా సౌత్‌ ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. సినిమాల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు నిర్మాతలు ఇక్కడ కొందరిని కలవాల్సి ఉంటుందని అనేవాళ్లు. ఆ విషయం నేరుగా చెప్పేవాళ్లుకాదు. కానీ వారి ఉద్దేశమైతే అదేనని తెలిసిపోయేది అని ఫాతిమా అన్నారు.

New Update
fatima sana

fatima sana

Fatima Sana Shaikh:   బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ అమీర్ ఖాన్ 'దంగల్'  సినిమాతో  ఒక్కసారిగా స్టార్ గా మారిపోయారు. అతి తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా మంచి చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకెళ్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫాతిమా కెరీర్ తొలి నాళ్ళల్లో తనకు ఎదురైనా కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నారు. 

fatima
fatima

సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్: ఫాతిమా

ఈ క్రమంలోనే  సౌత్ ఇండస్ట్రీలో తాను కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు సంచలన ఆరోపణలు చేసింది. ఒకానొక సందర్భంలో తాను సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొందరు డైరెక్టర్స్, నిర్మాతలు ఇన్ డైరెక్ట్ గా అన్నింటికీ రెడీనా అని అడిగేవారని చెప్పుకొచ్చారు. ఫాతిమా మాట్లాడుతూ.. నా కెరీర్ తొలినాళ్లలో ఒక సినిమా కోసం ఆడిషన్ కి వెళ్ళాను. అక్కడ ఓ దర్శకుడు మీరు ఏం చేయడానికైనా రెడీనా అని అడిగారు. అప్పుడు నేను నా పాత్ర కోసం ఏం అది చేస్తానని అతడితో చెప్పాను. కానీ.. అతను మాత్రం అదే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడిగారు. ఆ తర్వాత అతని ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. కానీ అతడు  ఎంతకు దిగజారుతాడో చూడాలని ఏమీ తెలియనట్లు ప్రవర్తించినట్లు తెలిపారు. 

ఇన్ డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు 

అలాగే సౌత్ పరిశ్రమలో నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా మాట్లాడుకుంటారని ఫాతిమా చెప్పుకొచ్చారు. ఇక్కడ మీరు కొందరిని కలవాల్సి ఉంటుందని ఉంటుంది అనేవాళ్లు. ఆ విషయాన్నీ నేరుగా చెప్పేవాళ్లుకాదు.  కానీ, ఎలా చెప్పినా వారి ఉద్దేశమైతే అదేనని తెలిసిపోయేది అంటూ కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేసింది.  సౌత్ ఇండస్ట్రీపై  ఫాతిమా కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

fatima sen
fatima sen

Also Read:Thandel Movie: తండేల్ లో ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ.18 కోట్లు ఖర్చు చేశారట.. ఏంటో తెలిస్తే షాకే !

Advertisment
Advertisment
తాజా కథనాలు