నయనతారపై ధనుష్ కేసు.. 10 కోట్లు డిమాండ్, హీరోయిన్ సంచలన ఆరోపణలు

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార.. ధనుష్ పై సంచలన ఆరోపణలు చేసింది. వ్యక్తిగతంగా తనపై ఇంత కక్ష పెట్టుకోవడం కరెక్ట్ కాదని పేర్కొంది. ఈ మేరకు సుమారు మూడు పేజీలున్న నోట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
fffg

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార.. ధనుష్ పై సంచలన ఆరోపణలు చేసింది. వ్యక్తిగతంగా తన ఇంత కక్ష పెట్టుకోవడం కరెక్ట్ కాదని పేర్కొంది. ఈ మేరకు సుమారు మూడు పేజీలున్న నోట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో వీరి మధ్య వివాదం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

అసలేం జరిగిందంటే..

నయనతార, విజయ్ సేతుపతి జంటగా 'నానున్ రౌడీ దాన్‌' (నేను రౌడీనే) అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. విగ్నేష్ శివన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ టైమ్ లోనే నయన్ - విగ్నేష్ ప్రేమలో పడ్డారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. కాగా ధనుష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నయనతార పెళ్లి, జీవిత విశేషాలతో 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 18న డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తున్నారు. 

ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో 'నేనే రౌడీనే' మూవీ షూటింగ్ టైంలో తీసిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీరైట్ యాక్ట్‌లో భాగంగా లీగల్ నోటీసులు జారీ చేశాడు. ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే నయనతార ధనుష్ పై పలు ఆరోపణలు చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేసింది.

Also Read :  రేవంత్ ఛాలెంజ్‌ స్వీకరించిన కిషన్ రెడ్డి..3 నెలలు అక్కడే నిద్ర!

అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా..

తండ్రి, గొప్ప దర్శకుడైన సోదరుడి సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నాలాంటి ఎంతోమంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా అని మన అందరికీ తెలుసు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి నేను ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది. నా వృత్తికి, ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. 

నా జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు సినీప్రియులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఆత్మీయుల సహకారంతో దీనిని రూపొందించాం. మీరు ఆ సినిమాతోపాటు మాపై పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులోభాగమైన ఇతర సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బందిపెడుతోంది. నా సినీప్రయాణం, ప్రేమ, పెళ్లితోపాటు నాతో ఉన్న అనుబంధాన్ని తోటి నటీనటులు పంచుకోవడం వంటి విశేషాలతో ఈ డాక్యుమెంటరీ సిద్ధమైంది. 

Also Read: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టార్ సింగర్స్.. ఫొటోలు వైరల్

నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరం. ఈ సినిమాలోని ఫొటోలు, వీడియోలు, పాటలు ఉపయోగించుకోవడానికి సంబంధించిన ఎన్‌వోసీ కోసం దాదాపు రెండేళ్ల నుంచి మీతో ఫైట్‌ చేస్తున్నాం. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ కార్యక్రమం రిలీజ్‌ దగ్గర కానున్న సమయంలోను మీ ఆమోదం కోసం ఎదురుచూశాం. చివరకు మేము ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాం. మీరు పర్మిషన్‌ ఇవ్వకపోవడంతో రీ ఎడిట్‌ చేశాం. ఆ పాటలు వాడుకోవడానికి మీరు పర్మిషన్‌ ఇవ్వకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది..' అని లేఖలో పేర్కొంది.

Also Read :  నయనతారపై ధనుష్ కేసు.. 10 కోట్లు డిమాండ్, హీరోయిన్ సంచలన ఆరోపణలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు