AP: ఏపీలో హడలెత్తిస్తున్న చిరుతలు.. భయాందోళనలో బ్రతుకుతున్న ప్రజలు.!
ప్రకాశం జిల్లా గిద్దలూరులో చిరుత కలకలం సృష్టిస్తోంది. చిరుతను చూసి స్థానికులు భయంతో కేకలు వేయగా చిరుత పాడుబడ్డ బావిలో చొరబడింది. వెంటనే అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వగా అధికారులు బావి చుట్టు వలపన్ని చిరుతను బంధించారు. అడవిలో విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.