/rtv/media/media_files/2025/10/16/meesaala-pilla-2025-10-16-15-08-13.jpg)
Meesaala Pilla
Meesaala Pilla: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా, అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా "మన శంకర వరప్రసాద్ గారు (MSG)" నుంచి వచ్చిన మొదటి పాట "మీసాల పిల్ల"(Meesaala Pilla Song) సంచలనం రేపుతోంది. విడుదలైన కాసేపటికే ఈ పాట యూట్యూబ్‌లో నెంబర్ 1 ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Also Read: మహేష్ బాబుతో లవ్ స్టోరీ చేస్తా.. 'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్ వైరల్ కామెంట్స్..!
ఈ పాటలో చిరంజీవి, నయనతార జంటగా మెరిశారు. చిరంజీవి తన స్టైల్‌లో నయన్‌ను టీజ్ చేస్తూ పాడే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. పాటలో మెగాస్టార్ స్టెప్పులు, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఆయన పాత సినిమాల్లోని ఎనర్జీ గుర్తుకు వస్తుంది. ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్ నుంచీ ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఉదిత్ నారాయణ రీ ఎంట్రీ..
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ ఈ పాటను పాడారు. చాలా కాలం తర్వాత ఉదిత్ గారు తెలుగులో పాడిన పాట ఇదే. అతని ఎనర్జిటిక్ వోకల్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “అమ్మాయే సన్నగా”, “రాధే గోవిందా” వంటి సూపర్ హిట్ పాటల తర్వాత ఇది ఆయనకు మంచి రీ ఎంట్రీ అని చెప్పొచ్చు.
Also Read: 'నా డార్లింగ్ సో స్వీట్'.. ప్రభాస్ ని పొగిడేస్తున్న ముద్దుగుమ్మ..!
విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాటకు వేలల్లో వ్యూస్ వచ్చాయి. పాట విజువల్స్ కూడా చాలా స్టైలిష్‌గా ఉండగా, చిరు-నయన్ మధ్య కెమిస్ట్రీ సినిమాపై అంచనాలు పెంచింది.
పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి 2026కి విడుదల కాబోతుంది. చిరంజీవి పాత్ర ఓ గ్యాంగ్‌స్టర్ మాస్ టచ్‌తో ఉండనుంది. ఇటీవలే నయనతార ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది, ఆమె ఇందులో శశిరేఖ అనే పాత్రలో నటిస్తున్నారు. చీరకట్టులో ఆమె లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.
Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
సంక్రాంతికి రానున్న ఈ సినిమా, మొదటి పాటతోనే హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. మెగాస్టార్ ఫ్యాన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా సినిమా ఉండబోతోందని చెప్పొచ్చు.