/rtv/media/media_files/2025/10/16/mithra-mandali-review-2025-10-16-14-47-28.jpg)
Mithra Mandali Review
Mithra Mandali Review
సినిమా పేరు: మిత్ర మండలి
విడుదల తేది: అక్టోబర్ 16, 2025
నటులు: ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం, రాఘ్ మయూర్, విష్ణు ఓయి, ప్రసాద్ బెహరా
దర్శకుడు: విజయేందర్ ఎస్
సంగీతం: ఆర్ ఆర్ ధ్రువన్
Also Read: 'నా డార్లింగ్ సో స్వీట్'.. ప్రభాస్ ని పొగిడేస్తున్న ముద్దుగుమ్మ..!
కథ:
చైతన్య (Priyadarshi), సత్విక్ (విష్ణు ఓయి), అభి (రాఘ్ మయూర్), రాజీవ్ (ప్రసాద్ బెహరా) అనే నలుగురు నిరుద్యోగ యువకుల చుట్టూ తిరిగే కథ. అభి, సత్విక్ ఇద్దరూ రాజకీయ నాయకుడి కూతురు స్వేచ (నిహారిక ఎన్‌ఎం)ని ప్రేమిస్తారు. వారికి చైతన్య సహాయపడతాడు. కానీ అనుకోకుండా వాళ్లంతా ఒక పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. ఇదే సినిమా కథ.
పాజిటివ్ పాయింట్లు:
కొన్నికామెడీ సన్నివేశాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ప్రత్యేకంగా కమెడియన్ సత్య చేసిన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సత్య వచ్చిన ప్రతిసారీ నవ్వు తెప్పించాడు. ప్రియదర్శి తన పాత్రలో చక్కగా నటించాడు. మిగిలిన యువ నటులు కూడా తమ వంతు కామెడీని పండించారు.
Also Read: 20 ఏళ్లకే అమ్మగా మారిన శ్రీలీల..!
నెగటివ్ పాయింట్లు:
సినిమా కథ అంతగా ఆకట్టుకునేలా లేదు. మొదట్లోనే "ఇదొక కథ లేని సినిమా" అని చెప్పినా, పెద్దగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వలేకపోయారు. 2nd హాఫ్ కు వచ్చేసరికి సినిమా పేస్ తగ్గిపోతుంది, కథ దారి తప్పుతుంది. స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉంది. కొన్ని సన్నివేశాల్లో కామెడీ బలవంతంగా అనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా కూడా సినిమా అంతగా మెప్పించదు.
Also Read: మహేష్ బాబుతో లవ్ స్టోరీ చేస్తా.. 'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్ వైరల్ కామెంట్స్..!
సాంకేతికంగా:
ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం సినిమా థీమ్‌కు సరిపోయేలా ఉంది. సినిమాటోగ్రఫీ ఓకేగా ఉంది. కానీ ఎడిటింగ్ కుదరలేదు. దర్శకుడు విజయేందర్ ఎస్ ప్రయత్నం బాగానే ఉన్నా, స్క్రీన్‌ప్లే ఇంకొంచెం మెరుగ్గా ఉంటె బాగుండేది.
Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
మొత్తంగా చూస్తే, మిత్ర మండలి కొంతవరకు నవ్వు తెప్పించేలా ఉన్నా, ఎక్కువగా బోరింగ్‌గా అనిపిస్తుంది. కథలో బలం లేకపోవడం, కామెడీ అంతగా వర్క్ అవ్వకపోవడం సినిమా మీద ప్రభావం చూపించాయి. కాసేపు వినోదంగా అనిపించినా, మొత్తానికి అంతగా ఆకట్టుకోలేకపోయింది..