/rtv/media/media_files/2025/10/15/sai-marthand-2025-10-15-12-41-42.jpg)
Sai Marthand
Sai Marthand: తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో అందరినీ ఆకట్టుకుంటూ, బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సినిమాలలో ‘లిటిల్ హార్ట్స్’ ఒకటి. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాయి మార్తాండ్, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. మౌళి, శివాని నాగరం జంటగా నటించిన ఈ సినిమా, అంచనాలను మించిపోయి ₹45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, సాయి మార్తాండ్‌కు ఘన విజయం తీసుకొచ్చింది.
మహేష్ బాబుతో సినిమా కల..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి మార్తాండ్, తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)పై ఎంతో అభిమానం ఉందని, ఓ రోజు ఆయనతో సినిమా చేయాలన్నది తన కల అని చెప్పారు. ఒకవేళ అవకాశం వస్తే, మహేష్ బాబుతో పక్కా ప్రేమకథా చిత్రం తీయాలని ఉందని, అది కూడా ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు భిన్నంగా, కొత్త నేపథ్యం మీద సాగేలా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!
ఇప్పటికే చిన్న సినిమాతో పెద్ద హిట్ అందుకున్న సాయి మార్తాండ్, అలాంటి కామెంట్స్ చేయడంలో ఆశ్చర్యం లేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. సాయి మార్తాండ్ కి కంటెంట్ పట్ల ఉన్న నమ్మకం చూస్తుంటే, భవిష్యత్తులో మహేష్ బాబు కూడా ఒక మంచి స్క్రిప్ట్‌తో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అసాధ్యమేమీ కాదని అనిపిస్తుంది.
Also Read:రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
ప్రస్తుతం సాయి మార్తాండ్ రెండు కొత్త సినిమాలపై పని చేస్తున్నారు. వాటిలో ఒకటి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. తొలి సినిమాతోనే తన స్టైల్‌కి గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడి తదుపరి సినిమాలపై కూడా ఆడియెన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది.
Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..
సాయి మార్తాండ్ మాటలు వింటే, ఆయన కేవలం కమర్షియల్ విజయం కోసం కాదు, కథలపై ఉన్న ప్రేమతో సినిమాలు చేసే వ్యక్తి అనిపిస్తోంది. మహేష్ బాబుతో సినిమా అనే అతడి కల త్వరలో నెరవేరాలని అందరూ కోరుకుంటున్నారు.