/rtv/media/media_files/2024/12/20/uKgSqiAUJvnhTsQILbjC.jpg)
sai pallavi. Photograph: (sai pallavi.)
చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక తాజాగా అత్యంత గ్రాండ్‌గా జరిగింది. తమిళ సినీ పరిశ్రమ ఎంతో ప్రత్యేకంగా భావించే ఈ వేడుకలో పలువురు నటులు, నటీమణులు, సంగీత దర్శకులు, కీలక నటులు, రైటర్స్, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ ఇలా వివిధ డిపార్ట్‌మెంట్‌లకు చెందిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి కోలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
Team #Amaran is Proud to be Honored at the 22nd Chennai International Film Festival. #Ciff2024
— Raaj Kamal Films International (@RKFI) December 20, 2024
Best Tamil Feature Film - Amaran
Best Actress - @Sai_Pallavi92
Best Music Director - @gvprakash
Best Cinematographer - @Dop_Sai #50DaysofAmaran #AmaranMajorSuccess… pic.twitter.com/PpSjRNUOmt
ఇది కూడా చూడండి: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!
బెస్ట్ యాక్ట్రెస్‌గా సాయి పల్లవి
ఈ వేడుకలో అమరన్ సినిమాకి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వరించింది. అలాగే ఇందులో హీరోయిన్‌గా నటించిన సాయి పల్లవి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక బెస్ట్ యాక్టర్‌గా విజయ్ సేతుపతి అవార్డును అందుకున్నారు. ‘మహారాజ’ చిత్రంలో ఆయన నటనకు గానూ ఈ అవార్డు లభించింది. ఈ విజయంపై సాయిపల్లవి ఆనందం వ్యక్తం చేశారు.
VETTAIYAN 🕶️ takes the spotlight at the 22nd Chennai International Film Festival - 2024 🏆 A film that captured hearts with its perfect blend of action, emotion, and entertainment! 🌟
— Lyca Productions (@LycaProductions) December 20, 2024
Best Entertaining Film - #Vettaiyan 🕶️
Best Actor in a Supporting Role Female -… pic.twitter.com/gHgqa5fQIg
ఇది కూడా చూడండి: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
ఈ అవార్డు అందుకున్న సమయంలో సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. ఎందుకంటే ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. సినిమా సినిమాకి చాలా పోటీ ఏర్పడింది. అలాంటి సమయంలో తనకు ఈ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది.
Celebrating the magic of cinema at the Awards & Closing Ceremony of the 22nd Chennai International Film Festival - 2024 🎬🌟#22ndChennaiInternationalFilmFestival #22ndCIFF@icaf_chennai @ChennaiIFF #SivanKannan #AnandRengaswamy @avmks @onlynikil pic.twitter.com/FIgeBx0AT2
— Little Talks (@LittletalksYt) December 20, 2024
ఇది కూడా చూడండి: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు
అనంతరం తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ముకుంద్ కుటుంబ సభ్యులు, ఆయన భార్యవల్లే ఇది సాధ్యమైందని చెప్పింది. రాజ్ కుమార్ పెరియాసామి వంటి దర్శకులే ఇలాంటి కథలు అందించగలరు అంటూ తెలిపింది. మరోవైపు ఈ అవార్డు అందుకోవడం పట్ల విజయ్ సేతుపతి ఆనందం వ్యక్తం చేశారు.
Our Sai Pallavi, Dir @Rajkumar_KP n @gvprakash at 22nd Chennai International Film Festival ✨🤍💞
— Sai pallavi (@SaiPallavi92s) December 20, 2024
once again congratulations to team #Amaran ❤️@Sai_Pallavi92 @Siva_Kartikeyan @Dop_Sai #SaiPallavi #Ciff2024 pic.twitter.com/7CyiDRaPXv
ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు
బెస్ట్ ఫిల్మ్: అమరన్
సెకండ్ బెస్ట్ ఫిల్మ్: లబ్బర్ పందు
బెస్ట్ యాక్టర్ : విజయ్ సేతుపతి (మహారాజ)
బెస్ట్ యాక్ట్రెస్: సాయిపల్లవి (అమరన్)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్: సీహెచ్ సాయి (అమరన్)
బెస్ట్ ఎడిటర్: ఫిలోమిన్ రాజ్ (అమరన్)
బెస్ట్ చైల్డ్ యాక్టర్: పొన్వెల్ (వాళై)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: దినేశ్ (లబ్బర్ పందు)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: దుషారా విజయన్ (వేట్టయన్)
బెస్ట్ రైటర్: నిథిలన్ సామినాథన్ (మహారాజ)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాశ్ (అమరన్)
స్పెషల్ జ్యూరీ అవార్డు : మారి సెల్వరాజ్ (వాళై), పా.రంజిత్ (తంగలాన్)