Brahma Anandam: బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీకి మారు పేర్లలో అతని పేరే టాప్‌లో ఉంటుందని అనడంలో అతిశయోక్తి లేదు. అయితే నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్‌లు ఇద్దరూ కలిసి ఓ సరికొత్త స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఒరిజినల్‌గా వీరు తండ్రి కొడుకులు అయినా.. వెండి తెరపై మాత్రం తాత, మనవడు పాత్రలో బ్రహ్మా ఆనందం అనే సినిమాతో రానున్నారు.
ఇది కూడా చూడండి: Saif Ali khan: సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే
Never before laughter riot is here!! 😎
— M🕊️🌸 (@Mrudhulaaaaa) January 16, 2025
Presenting The #BrahmaAnandam Teaser 🤗
A Laughter kicking Synergy of #RajaGoutham &
Legendary #Brahmanandam 😂💥
- https://t.co/oebq8mBNkL
Grand Release - Worldwide on 14th FEB 🥳
This Valentine's Day!
You will laugh 😆
You will laugh… pic.twitter.com/HrsDsm8Tz7
ఇది కూడా చూడండి: Manchu Manoj: చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్
నిఖిల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..
ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తుండగా.. ఆర్.వి.ఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపంచనుండగా.. ప్రియా వడ్లమాని హీరోయిన్‌గా చేస్తోంది. ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
తండ్రీ కొడుకులు తాత మనవడిగా వెండితెరపై తమదైన కామెడీతో ఆలరించారు. కేవలం టీజర్‌లోనే ఇంత నవ్వించారంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందో మీ ఉహకే వదిలేస్తున్నా. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో మరి చూడాలి.
ఇది కూడా చూడండి: Alcohol: ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే క్యాన్సర్‌లు..డేంజర్‌లో మీ ఆరోగ్యం