/rtv/media/media_files/2025/01/20/K1LoOHFHSGmNV1ct6CDs.jpg)
actor rangaraju
Actor Rangaraju: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆకస్మాత్హుగా గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అయితే వారం క్రితం రంగరాజు హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్ లో గాయపడగా ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలోనే గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. రంగరాజు మృతి పట్ల టాలీవుడ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.
Actor Vijay Rangaraju, also known as Raj Kumar, passed away today due to a heart attack at a private hospital in Chennai. He was injured during a film shoot a week ago.
— Telugu Chitraalu (@TeluguChitraalu) January 20, 2025
He's famous for his role in Yagnam. pic.twitter.com/syp2avxGQc
విలన్ గా పాపులర్..
మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం 'వియత్నాం కాలనీ' మూవీతో రంగరాజు సినీ అరంగేట్రం చేశారు. ఆ చిత్రంలో విలన్ గా మెప్పించిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అటు తెలుగులోనూ వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. బాపు దర్శకత్వంలో వచ్చిన 'సీతా కళ్యాణం' తో తెలుగులో పరిచయమయ్యారు. అనంతరం 1994 లో భైరవ ద్వీపం సినిమాలో విలన్ గా ఆయన నటనకు ఎంతో పేరు వచ్చింది. దీంతో ఆయన ఎక్కువగా విలన్, సహాయ పాత్రల్లో నటించారు. గోపీచంద్ 'యజ్ఞం' సినిమాలో విలన్ పాత్ర రంగరాజుకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. ' మగరాయుడు', 'జిన్నా, విశాఖ ఎక్స్‌ప్రెస్, ఢమరుకం, బ్యాండ్ బాజా, శ్లోకం వంటి సినిమాల్లో నోటబుల్ క్యారెక్టర్స్ చేశారు.
ఇది కూడా చూడండి: Horoscope: నేడు ఈ రాశి వారు వారికి చాలా దూరంగా ఉండాలి..లేకపోతే ఇక అంతే సంగతులు