/rtv/media/media_files/2025/02/01/MHVdTetMMmEvbEdr91KE.jpg)
bollywood hero Aamir Khan getting ready for his third marriage
బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు స్టార్ హీరో అమీర్ ఖాన్. ముఖ్యంగా దంగల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అనంతరం మరిన్ని హిట్ చిత్రాలతో కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు.. సినిమాలకు దూరమయ్యాడు. మరోవైపు తన పర్సనల్ లైఫ్ విషయంలోనూ అటు ఇటు అడుగులు వేస్తూ పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?
మూడో పెళ్లికి రెడీ
ఇప్పటికి రెండు పెళ్లిళ్లు చేసుకున్న అమీర్ ఖాన్.. ఇప్పుడు మూడో పెళ్లికి రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. అది కూడా ఆయన తన పిల్లలకు పెళ్లి చేయాల్సిన టైంలో తాను పెళ్లి చేసుకోవడం ఏంటని సోషల్ మీడియాలో ఈ టాపిక్ జోరుగా హైలైట్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల విషయానికొస్తే..
అమీర్ ఖాన్ వయస్సు ప్రస్తుతం 59 ఏళ్లు. ఈ వయసులో ఆయన మళ్లీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన ఓ యువతితో అమీర్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అక్కడవరకు మాత్రమే కాదండోయ్.. ఇటీవలే ఆ యువతిని తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడని.. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
దీంతో త్వరలోనే అమీర్ జంట ప్రేమ బంధంతో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అమీర్‌కు ఇది వరకే రెండు పెళ్లిళ్లు అవ్వగా.. వారికి విడాకులు ఇచ్చేశాడు. అందులో అతడి మొదటి వివాహం 1986లో రీనా దత్తాతో జరిగింది. వీరికి జునైద్, ఐరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇక 2002లో ఒకరిపై ఒకరికి మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత దర్శకురాలు కిరణ్ రావుతో ప్రేమలో పడి 2005లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఆజాద్ ఉన్నాడు. వీళ్ల జీవితం హ్యాపీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక అమీర్ ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు.