Karishma Sharma: కదులుతున్న రైలు నుండి దూకేసిన హీరోయిన్.. తల, వీపుకు గాయాలు

బాలీవుడ్ నటి కరిష్మా శర్మ ముంబైలో కదులుతున్న లోకల్ రైలు నుండి దూకి గాయపడ్డారు. తన స్నేహితులు రైలు ఎక్కలేదని గమనించి భయంతో ఆమె దూకేసింది. ఈ ఘటనలో ఆమె వెన్ను, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె అభిమానులను ప్రార్థనలు కోరారు.

New Update
bollywood-actress-karishma

bollywood-actress-karishma

రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్(Ragini MMS Returns), ప్యార్ కా పంచనామా(Pyaar Ka Punchnama) వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి కరిష్మా శర్మ. ఈమె తాజాగా ఒక పెద్ద ప్రమాదానికి గురయ్యారు. ముంబైలో కదులుతున్న లోకల్ రైలు నుండి దూకి తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు. 

షూటింగ్‌ నిమిత్తం ముంబైలోని లోకల్ ట్రైన్‌(mumbai-local-train) లో చర్చిగేట్‌కు వెళ్తున్నానని తెలిపింది. ఆ సమయంలో తాను మాత్రమే ట్రైన్ ఎక్కానని.. కానీ తన స్నేహితులు రైలు ఎక్కలేదని గమనించి భయంతో దూకేసినట్లు పేర్కొంది. దీని కారణంగా ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం నటి కరిష్మా శర్మ(Karishma Sharma) ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టారు. తాను త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించాలని అభిమానులను కోరారు. 

Karishma Sharma Accident

నటి కరిష్మా ఇన్‌స్టా పోస్టు

నటి కరిష్మా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్టు ప్రకారం.. ‘‘నిన్న చర్చిగేట్‌లో షూటింగ్ కోసం వెళ్తున్నాను. ఆ సమయంలో నేను చీర కట్టుకుని రైలు ఎక్కాను. నేను రైలు ఎక్కగానే.. రైలు వేగం పెరగడం ప్రారంభమైంది. నా స్నేహితులు ట్రైన్ ఎక్కలేదని గమనించాను. దీంతో నాకు చాలా భయం వేసింది. వెంటనే నేను ఆ ట్రైన్‌ నుంచి కిందికి దూకేశాను. దాని కారణంగా నా వీపుకు గాయం అయింది. నా తల వాచిపోయింది. నా శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

తలకు గాయం కావడంతో డాక్టర్లు MRI స్కాన్ తీయించారు. అనంతరం నన్ను ఒక రోజు పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. నిన్నటి నుండి నాకు చాలా నొప్పిగా ఉంది. కానీ నేను బలంగా ఉన్నాను. దయచేసి నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’’ అంటూ నటి కరిష్మా తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. 

అనంతరం ఆ నటి స్నేహితురాలు హాస్పిటల్‌ నుండి ఆమె ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె ఇలా రాసింది.. ‘‘కరిష్మాకు ఇలా జరిగిందని నేను నమ్మలేకపోతున్నాను. నా స్నేహితురాలు రైలు నుండి పడిపోయింది. ఆమెకు ఏమీ గుర్తులేదు. ఆమె కింద పడిపోవడం మేము గుర్తించాము. ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తీసుకువచ్చాము. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యావేక్షణలో ఉన్నారు’’ అంటూ తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు