ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’కు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడం, మలయాళం ఇలా ప్రతీ భాషలోనూ బిగ్ బాస్ షోకి అత్యధిక ప్రేక్షకాదరణ అందుతుంది. ఈ షో ద్వారా ఎంతో మంది ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత సినిమాల్లో బిజీ బిజీ అయిపోతున్నారు.
ఇది కూడా చూడండి: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్
కానీ ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. అతడిపై ఎవరో ఒకరు దాడి చేస్తూనే ఉన్నారు. అతడు మరెవరో కాదు పునీత్ సూపర్ స్టార్. సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులర్ అయిన పునీత్ సూపర్‌స్టార్ బిగ్ బాస్‌తో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఇది కూడా చూడండి: బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు
పునీత్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి
ఇటీవల అతడిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రదీప్ ఢాకాతో పునీత్ సూపర్ స్టార్‌కి గొడవ జరిగింది. దీంతో పునీత్ చెంపలపై కొడుతూ దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే దీనికి కారణం కూడా ఉంది. సప్లిమెంట్ బ్రాండ్‌కు సంబంధించిన ప్రమోషన్ ఒప్పందాన్ని తీసుకున్న పునీత్.. దాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారనే ఆరోపణలతో ఈ వివాదం తలెత్తింది. దీని కోసం పునీత్ డబ్బులు తీసుకున్నా.. అగ్రిమెంట్ నిబంధనలను పాటించలేదని ప్రదీప్ ఢాకా డిమాండ్ చేసినట్లు ఆ వీడియోలో ఉంది.
Full Clip of Puneet Superstar got beaten up
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 21, 2024
(Context: He took the money for Promotion but didn't promoted the Brand)pic.twitter.com/10yB8KAuXk https://t.co/9czIh6sGBJ
ఇది కూడా చూడండి: ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ
పునీత్ చెంప చెల్లుమనిపించిన యువకుడు
అది మరువక ముందే పునీత్ సూపర్ స్టార్ మరోసారి దాడికి గురయ్యాడు. అతడు విమానం నుంచి కిందకి దిగుతున్న క్రమంలో ఓ యువకుడు అతడిపై దాడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 16 సెకన్ల క్లిప్‌లో ఓ యువకుడు పునీత్‌పై దాడి చేయడం చూడవచ్చు. పదే పదే చెంపపై కొడుతున్నట్లు వీడియోలో ఉంది. అనంతరం విమానం సిబ్బంది జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుమనిగించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Puneet Superstar got Beaten up by a Random guy while deporting from Plane
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 18, 2024
pic.twitter.com/ke8Au4gD1N
ఇది కూడా చూడండి: లెస్బియన్స్‌తో సహజీవనం చట్టబద్ధమే.. హైకోర్టు సంచలన తీర్పు