/rtv/media/media_files/2025/10/10/bigg-boss-promo-2025-10-10-19-18-07.jpg)
bigg boss promo
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో నెక్స్ట్ వీక్ కెప్టెన్ ఎవరనే దాని గురించి కంటెస్టెంట్స్ మధ్య చర్చలు జరిగినట్లు కనిపించింది. తనూజ, పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య కెప్టెన్సీ పోటీ నెలకొంది. అయితే 5వ వారం కెప్టెన్సీ కోసం ఇమ్మాన్యుయేల్, తనూజ, భరణి, దివ్య, కళ్యాణ్, రాము రాథోడ్ పోటీ పడగా.. తనూజ, పవన్ కళ్యాణ్ చివరి రౌండ్ కి చేరుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.
Also Read : దీపిక పదుకుణేకు కేంద్రం కీలక బాధ్యతలు!
బిగ్ బాస్ ట్విస్ట్
అప్పటివరకు టాస్క్ ద్వారా కెప్టెన్సీ ప్రక్రియను కొనసాగించిన బిగ్ బాస్.. చివరి రౌండ్ లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. వీరిద్దరిలో ఎవరు నెక్స్ట్ కెప్టెన్ అనేది మిగతా ఇంటి సభ్యుల సపోర్ట్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. దీంతో హౌస్ మేట్స్ మధ్య చర్చలు మొదలయ్యాయి. తనూజ, కళ్యాణ్ ఇద్దరిలో ఎవరిని కెప్టెన్ చేయాలి అని తెగ డిస్కషన్లు జరిగాయి. మరోవైపు తనూజ, కళ్యాణ్ కూడా ప్రతీ కంటెస్టెంట్ దగ్గరికి వెళ్లి.. తమకు సపోర్ట్ చేయండి అంటూ అప్పీల్ చేసుకున్నారు.
పాపం తనూజ
తనూజ దివ్య దగ్గరికి వెళ్లి సపోర్ట్ చేయమని అడగగా.. నేను చేయనంటే చేయను అని మొహం మీదే చెప్పేసింది దివ్య. దివ్య అలా చెప్పడానికి కారణం.. దీనికి ముందు జరిగిన రౌండ్ లో తనూజ దివ్యను కెప్టెన్సీ రేస్ నుంచి ఎలిమినేట్ చేయడం. మరోవైపు శ్రీజ, డెమోన్ పవన్.. కళ్యాణ్ ని కెప్టెన్ చేసే పనిలో ఉన్నారు. కళ్యాణ్ కి సపోర్ట్ చేయండి అంటూ సంజన, రీతూ, ఫ్లోరాతో చర్చలు జరుపుతున్నారు. ప్రోమో ప్రకారం.. తనూజ కంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ మంది కంటెస్టెంట్స్ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నెక్స్ట్ వీక్ కెప్టెన్ పవన్ కళ్యాణ్ అని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
Also Read: Rajamouli Birthday Special: సాహోరే జక్కన్న.. నీ తర్వాతే ఎవరైనా..! రాజమౌళి సక్సెస్ సీక్రెట్స్ ఇవే..!