Bigg Boss 9 Telugu: ఫైర్ స్ట్రామ్ ప్రోమో.. అందరు హోస్టులు ఒకే స్టేజ్ పై! పచ్చళ్ళ పాప, మాధురి రచ్చ రచ్చ!

బిగ్ బాస్  'ఫైర్ స్ట్రామ్' ప్రోమో విడుదలైంది. ఈ ఆదివారం ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా, ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. 'ఫైర్ స్ట్రామ్'  పేరుతో ఏకంగా ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీలు బిగ్ బాస్ లోకి రాబోతున్నారు.

New Update

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్  'ఫైర్ స్ట్రామ్'(fire strome) ప్రోమో విడుదలైంది. ఈ ఆదివారం ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా, ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. 'ఫైర్ స్ట్రామ్'  పేరుతో ఏకంగా ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీలు బిగ్ బాస్ లోకి రాబోతున్నారు. ప్రోమోలో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఫేస్ లు రివీల్ చేయకుండా.. కేవలం వాళ్ళ వాయిస్ లు మాత్రమే వినిపించారు. దీంతో వైల్డ్ కార్డ్స్ ఎవరనేదానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు స్టేజ్ పై హోస్ట్ నాగార్జున వైల్డ్ కార్డ్స్ ఫుల్ వైల్డ్ గా ఉండబోతున్నారు అంటూ మరింత ఆసక్తిని పెంచారు. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం.. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన దివ్వెల మాధురి, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అలేఖ్య చిట్టి పికిల్స్  చెల్లి రమ్య మోక్ష, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, నటి అయేషా జీనథ్, శ్రీనివాస్ సాయి,  గౌరవ్ గుప్తా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా వచ్చారని తెలుస్తోంది. 

Also Read :  70th FilmFare Awards 2025: ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘లాపతా లేడీస్‌’.. ఉత్తమ నటిగా అలియా!

అందరు హోస్టులు ఒకే స్టేజ్ పై 

'ఫైర్ స్ట్రామ్' ఎపిసోడ్ సందర్భంగా కన్నడ, తమిళ్, మలయాళం, హోస్టులు అందరూ ఒకే స్టేజ్ పై సందడి చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షోలోని కంటెస్టెంట్స్ అండ్ షోకు బెస్ట్ విషెస్ తెలిపారు. అలాగే హోస్ట్ నాగార్జునతో షో గురించి ముచ్చటించారు. 

Also Read: Bigg Boss 9 Telugu: భరత నాట్యంతో దివ్వెల మాధురి ఎంట్రీ.. ఆరుగురు వైల్డ్ కార్డ్స్ తో రచ్చ రంబోలా!

Advertisment
తాజా కథనాలు