/rtv/media/media_files/2025/10/12/bigg-boss-wild-card-entrys-2025-10-12-15-02-23.jpg)
bigg boss wild card entrys
Bigg Boss 9 Telugu: ఈ సారి చదరంగం కాదు.. రణరంగం అంటూ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది బిగ్ బాస్ సీజన్. గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్. బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి 6 మంది కామాన్సర్ కి అవకాశం కల్పించారు. మొత్తం 9 మంది సెలబ్రెటీ కంటెస్టెంట్ 6 మంది కామన్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టారు. ఇప్పటికే నాలుగు వారాల షో పూర్తవగా.. నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. అయితే గడిచిన నాలుగు వారాల్లో మొదటి రెండు వారాలు తప్పా మిగతా వారాలు షో చప్పగా నడిచింది. దీంతో హౌజ్ లో హీట్ పెంచేందుకు గట్టిగా ప్లాన్ చేశారు బిగ్ బాస్.
Also Read : ఏం బ్రతుకులురా మీవి.. చి..చి..! 'ఆంధ్ర కింగ్ తాలూకా' టీజర్ అరాచకం అంతే!
ఆరుగురు వైల్డ్ కార్డ్స్
బిగ్ బాస్ 2.0 పేరుతో హౌజ్ లోకి ఆరుగురు వైల్డ్ కార్డులను పంపించబోతున్నారు. ఈరోజు జాగబోయే నైట్ ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరనేది తేలిపోతుంది. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం.. ఈ వైల్డ్ కార్డ్స్ షూటింగ్ పూర్తవడం.. కంటెస్టెంట్స్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా అయిపోయిందట. సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, నటి అయేషా జీనథ్, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా తో పాటు ఫుల్ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్ దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య మోక్ష వైల్డ్ కార్డు ఎంట్రీస్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో హౌస్‌లో కొత్త పోటీ, కొత్త డ్రామా మొదలు కాబోతోంది. ఏకంగా ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ 9 మరింత రసవత్తరంగా మారనుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
దివ్వెల మాధురి క్లాసికల్ పర్ఫార్మెన్స్ తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారట. మాధురి తన అభిప్రాయాలను కూడా ఎంతో బలంగా, ముక్కుసూటిగా చెబుతుంటారు. గతంలో చాలా సందర్భాల్లో ఆమె వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తి బిగ్ బాస్ ఇంట్లోకి వస్తుండడంతో షో మరింత వేడెక్కనున్నట్లు నెటిజన్లు అనుకుంటున్నారు.
Also Read: Andhra King Taluka: ఏం బ్రతుకులురా మీవి.. చి..చి..! 'ఆంధ్ర కింగ్ తాలూకా' టీజర్ అరాచకం అంతే!