/rtv/media/media_files/2025/10/25/bigg-boss-telugu-9-divvela-madhuri-2025-10-25-18-17-15.jpg)
Bigg Boss Telugu 9 Divvela Madhuri
Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఈ వారం నామినేషన్స్(Bigg Boss 9 Telugu Nominations) లో దివ్వెల మాధురి(divvela madhuri) వర్సెస్ రీతూ గొడవతో హాజ్ ఒక్కసారిగా వేడెక్కింది. ఈ గొడవలో మాధురి రీతూ పై రెచ్చిపోయింది. నువ్వు పవన్ అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు, మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్యూర్ బాండ్ కాదు.. కేవలం అవసరానికి మాత్రమే నువ్వు డెమోన్ ని వాడుకుంటున్నావు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వారం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మాధురి పేరే వినిపిస్తోంది. రీతూను ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. దీనికి తోడు ఆమె పదే పదే కంటెస్టెంట్లతో వాదులాడడం, గొడవలు పెట్టుకోవడం పై నెటిజన్లను నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆమె ఆమె అహంకారం, నోటి దురుసుతో సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఎదుర్కుంటున్నారు. దీంతో ఈ వారం ఆమె ఓటింగ్ కూడా భారీగా తగిపోయినట్లు తెలుస్తోంది.
Also Read : ఫ్యాన్స్ కి నిరాశే.. 'మెగా158' ప్రాజెక్ట్ పై మాళవిక అప్డేట్!
మాధురి అవుట్
ఈ వారం దివ్వెల మాధురి, కళ్యాణ్, రాము, డీమాన్ పవన్, గౌరవ్, సంజన, తనూజ, రీతూ చౌదరి నామినేషన్స్ లో ఉండగా.. దివ్వెల మాధురి డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ఓటింగ్ పోల్స్ ప్రకారం.. మాధురి ఓటింగ్ లిస్ట్ లో చివరి స్థానంలో ఉంది. మాధురి హౌజ్ లో తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, ఆటలో ఆమె క్రీడా స్ఫూర్తి చూపడం లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మాధురిని ఎలిమినేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రీతూతో జరిగిన గొడవ తర్వాత మాధురి గ్రాఫ్ భారీగా పడిపోయింది. ముందు వారం తన ఆటతీరుతో మెప్పించినప్పటికీ.. ఈ వారం నామినేషన్స్ లో రీతూ పట్ల ఆమె ప్రవర్తించిన విధానం, మాట్లాడిన మాటలు ప్రేక్షకులను అసహనానికి గురిచేశాయి. అందుకే ఆమెను ఎలిమినేట్ చేయాలని భావిస్తున్నారు.
మాధురి తరువాత గౌరవ్ గుప్తా కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. అయితే నామినేషన్స్ లో మిగతా కంటెస్టెంట్స్ అందరికీ బయట ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంది. కానీ, మాధురి, గౌరవ్ కి మాత్రం అంతగా ఆదరణ లేదు. దీనికి తోడు హౌజ్ వీళ్ళ ఆట తీరు కూడా అలాగే ఉందని ప్రేక్షకుల అభిప్రాయం.
Follow Us